Sheikh Nazir: ప్రజా దీవెన, కోదాడ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో (Congress party elections)ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల వరకు రైతులు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని క్యాబినెట్ మీటింగ్ (Cabinet meeting)లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కోదాడ ముస్లిం మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ నజీర్ (Sheikh Nazir) ఆదివారం ఓ ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ (congress party) ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం రెండు దఫాలుగా రుణమాఫీ విడతల వారీగా చేయడంవల్ల అవి వడ్డీకే సరిపోయిందన్నారు.కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని రైతుల సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు. కోదాడ pacs లో 2018 డిసెంబర్18 నుండి 2023 డిసెంబర్ 9 వరకు 2381 రైతుల కు చెందిన 11 కోట్ల రూపాయలు మాఫీ కానున్నాయని ఆయన తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.