Shekhar Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లాలోని స్వయం సహా యక సంఘాలకు స్త్రీ నిది ద్వారా రూ. 58 కోట్ల 40 లక్షల చెక్కును జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి డిఆర్డిఓ పిడి శేఖర్ రెడ్డి చేతుల మీదుగా నల్లగొండ జిల్లా మహిళ సమైక్యకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మహిళా సంఘాలు దినధినా భివృద్ధిగా ముందుకు సాగుతున్నా యని. ఆర్థికంగా వారి కుటుంబాలు అభివృద్ధి బాటలో నడవాలని ప్రతి ఒక్క మహిళా సంఘ సభ్యురాలు. ఆర్థిక పురోగతి చెందాలని ఆశిస్తు న్నారన్నారు. తీసుకున్న అప్పు ప్రతినెల సంఘ సభ్యులు చెల్లిం చాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో జి ఇందిర స్త్రీనిధి తెలంగాణ రాష్ట్రం అధ్యక్షురాలు, శ్రీలేఖ ఆర్ ఎం, రామలింగయ్య బ్యాంకు లింకేజీ, బెనర్జీ, అనిత, నాగమణి, సువర్ణ, గీత, రేణుక, నగేష్, తదితరులు పాల్గొన్నారు.