డి ఆర్ డి ఏ పిడి శేఖర్ రెడ్డి
మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 29 మహిళ పొదుపు సంఘాలు తమ లక్ష్యాలను పూర్తి చేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలని ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసాను పొదుపుగా వాడుకోవాలని డి ఆర్ డి ఏ పిడి శేఖర్ రెడ్డి అన్నారు ఆయన శనివారం రోజున నాంపల్లి మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళ సమాఖ్య అధ్యక్షురాలు గాలెంక ఇందిరా అధ్యక్షతన మహిళ పొదుపు సంఘాలకు సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని మహిళా పొదుపు సంఘాలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి బ్యాంకు లింకేజీ నిధులతో పాటు శ్రీనిధి నిధులు సైతం బ్యాంకు లింకేజు చేసుకొని కోళ్ల పెంపకం పాడి గేదెల పెంపకం చేసుకోవడానికి లబ్ధిదారులను గుర్తించి 20 25 ఫిబ్రవరి నాటికి పూర్తి చేసుకోవాలని మహిళా సంఘాల మహిళలను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల ఏపి ఎం వినోద్ కుమార్ సీసీలు సత్యనారాయణ సత్యం నాగమణి శ్రీశైలం సావిత్రి. వి బి కే లు కోరే అలివేలు జక్కుల రామలింగమ్మ తదితరులు పాల్గొన్నారు