–బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి
Shilpa Reddy : ప్రజా దీవెన,హైదరాబాద్:రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అ ధ్యక్షురాలు శిల్పారెడ్డి ఖండించా రు. ద్రౌపదీ ముర్ముని ఉద్దేశించి బోరింగ్”, “రబ్బరు స్టాంప్” అనే అహంకార వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అన్నారు. ఈ బీజేపి రాష్ట్ర కార్యా లయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో శిల్పారెడ్డి.
మాట్లాడుతూ గాంధీ కుటుంబం కాకుండా ఇతర వ్యక్తులు ఉన్నత పదవులు చేపడితే సోనియా గాంధీ సహించలేక పోతున్నారు అని కాంగ్రెస్ వైఖరిని మహిళా సమా జం, దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తు న్నారని,ప్రజాస్వామ్యాన్ని అవమా నించిన సోనియా గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలి అని డిమాండు చేశారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ధి పనుల ను, కేంద్ర ప్రభుత్వ పథకాలతో దేశ ప్రజలకు జరిగిన ప్రయోజనాలను వివరించారు.. అయితే, కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వ విజ యాలను ఓర్వలేక, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, దేశ ప్రజలకు జరుగుతున్న మేలును సహించలేక రాష్ట్రపతి గారిపై అనుచితమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గారు గౌరవ రాష్ట్రపతిపై “బోరింగ్”, “అలసిపోయారు”, “రబ్బరు స్టాంప్” అంటూ విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీ రాజకీయ అహంకారాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళా సాధికారత గురించి మాటలు వల్లెవేసే కాంగ్రెస్ నాయకులు.. ఒక గిరిజన మహిళా రాష్ట్రపతిని గౌరవించాలనే విజ్నత లేకపోవడం సిగ్గుచేటు అని అ న్నారు. గత 10 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లింది. పేదల కోసం, మహిళలు, రైతులు, గిరిజనుల కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఉజ్వల యోజన, హర ఘర్ జల్, ప్రధాన మంత్రి అవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు లక్షలాది మందికి లబ్ధి చేకూర్చాయి. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంలో రాష్ట్రం, దేశం, ప్రజల శ్రేయస్సు కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అయితే, గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పై కాంగ్రెస్ నాయకులు ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం అంటే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లుగానే భావిస్తున్నాం. అందుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తక్షణమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. లేకుంటే దేశ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని శిల్పారెడ్డి హెచ్చరించారు.