షిర్డీ రైలు లో మహిళా దొంగల బీబత్సం
ప్రజా దీవెన/నిజామాబాద్: రైలు ప్రయాణంలో దొంగల ముఠా ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా షిర్డి రైలు లో మహిళా దొంగలు కలకలం సృష్టించారు. రైలులో దొంగ తనానికి పాల్పడిన 9 మంది యువతులు ఒక్కసారిగా ప్రయాణికులపై పడి అందినకాడికి దండుకున్నారు.ప్రయాణికుల బ్యాగులు, మహిళల బంగారు చైన్లు ఇష్టానుసారంగా దాడి చేసి మరీ అందిన కాడికి చోరికి పాల్పడ్డారు.
దీంతో ప్రయాణికులందరూ మూకుమ్మడిగా వారిపై తిరగపడి 9 మంది యువతులు పట్టించారు నవిపేట లో క్రాసింగ్ ఉండటం తో నిలిచిన రైలు ను అసరా చేసుకొని రైలు లో చొరబడ్డ మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందిన 9 మంది యువతులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఎస్- 1 భోగి నుంచి ఎస్.- 10భోగి వరకు తిరుగుతూ ప్రయాణికుల బ్యాగులు ఈ కిలాడీ మాహిళ లు మాయం చేసి బాసర వద్ద చైన్ లాగి పారిపోయే ప్రయత్భం లో ప్రయాణికులు అప్రమత్తమై మహిళా దొంగలను పట్టుకున్నారు. రైల్వే పోలీసులకు అప్పగింత విచారణ జరుపుతున్నారు.