Shripati Ram Reddy : ప్రజా దీవెన నాంపల్లి : జనవరి 13 తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం నల్లగొండ జిల్లా ప్రజలు ఆదరిస్తున్నారని సభ్యత్వం తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీభువనగిరి పార్లమెంట్ కమిటీ మెంబర్ శ్రీపతి రామ్ రెడ్డి అన్నారు ఆయన ఆదివారం రోజున మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం పరిధిలో మల్లపురాజుపల్లి పెద్దాపురం గ్రామాలలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించి సభ్యత్వా లను అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ టిడిపి సభ్యత్వాలు పొందాలని అందుకు పార్టీ ప్రమాద బీమా సాధారణ బీమా అవకాశం కల్పించిందని అందుకు.
ప్రజలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందాలని కోరారు తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారని ప్రస్తుతం 2047 దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేస్తున్నారా ని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ రెడ్డి నాంపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మొగుదాల పార్వతమ్మ నాయకులు దానబోయిన నరేష్ మహేష్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు