Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SI Mallesh : సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

మీ కుటుంబానికి మీ అవసరం ఉంది…సెల్ఫోన్ తో కాదు: ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

SI Mallesh : ప్రజా దీవెన,కోదాడ: రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యతని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మసోత్సవల్లో భాగంగా కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద సెల్ ఫోన్ డ్రైవింగ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, వాహనాలు వేగంగా నడిపి ప్రమాదాలకు గురికావద్దని కోరారు. రహదారి నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సు రద్దు చేసి వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

 

సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల నియంత్రణ కూలిపోయి ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. అకస్మాత్తుగా ఎదురుగా ఏదైనా వస్తే వాహనంపై నియంత్రణ కొల్పోయి ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ తో వాహనదారులు ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారని ఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు. మీ కుటుంబానికి మీ అవసరం ఉందని రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండి ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఎస్సై సూచించారు.