–అవకాశాలేన్నిచ్చినా మారని వైఖరి
–అక్రమంగా రేషన్ బియ్యాన్ని బం ధువుల ద్వారా అమ్మకం అనే అభియోగం
ప్రజా దీవెన, మట్టపల్లి: ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో వివాదాల్లో తల దూర్చి చివరికి కారు విషయంలో అడ్డంగా బుక్ అయ్యాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. పలు అవినీ తి ఆరోపణల నేపథ్యంతో జిల్లా లో ని మరంపల్లి ఎస్సై రామాంజనేయులును విధుల నుంచి తొలగి స్తున్నట్లు తెలంగాణ మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.
మట్టపల్లికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల ఎస్సై రామాంజనేయులు ఆ వ్యక్తికి చెందిన కారు మట్టపల్లి లోనే ఉండటంతో తన సొంత అవ సరాల కోసం వినియోగించు కొని తిరిగి ఇస్తానని తీసుకున్నారు.వా రం రోజులు గడుస్తున్నా కారు ను తిరిగి ఇవ్వకుండా ఇబ్బందు లకు గురిచేస్తుండటంతో బాధితుడు ఈ విషయమై డీజీపీతోపాటు జిల్లా ఎ స్పీకి ఈ- మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు. ఎస్సైపై విచారణకు ఆ దేశించిన అధికారులకు ఈ ఘ టనతోపాటు పలు అవినీతి ఆరో పణలు వెలుగు చూసినట్లు సమా చారం.
దీంతో ఎస్సై రామాంజనే యులును విదుల నుంచి తొలగిస్తు న్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
గతంలో సూర్యాపేట జిల్లా అనంతగిరి, నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో విధు లు నిర్వహిస్తూ సస్పెండ్ గురి అ య్యారు.అప్పుడు కూడా అవినీతి ఆరోపణలు వల్ల సస్పెండ్ అయ్యా రు. స్థానికంగా ఎస్ఐపై పలు ఆరో పణలు ఉన్నాయి. ఇటీవల ఆవు లు చనిపోయిన ఘటనలో డబ్బు లు డిమాండ్ చేసినట్టు ఆరోపణ లు,పీడీఎస్ బియ్యం అక్రమ రవా ణాలో బంధువులకి సహకరించార ని ఆరోపణలు, పోలీస్ స్టేషన్లో ప్రతి కేసుకి ఉంటుందనే పద్ధతిలో వ్యవ హరించే వారిని దళితుల పట్ల అనుచితంగా వ్యవహరించారని ఆరోపణలు కూడా ఇటీవల కాలం లో ఎస్సై పై ఎక్కువయ్యాయి.