*రెండు ద్విచక్ర వాహనాల స్వాధీనం
*23 మంది వద్ద నుండి సిలిండర్లు రికవరీ
SI Ranjith Reddy: ప్రజా దీవెన, కోదాడ: మట్టంపల్లి మండలం మట్టంపల్లి గ్రామానికి చెందిన మామిడి శ్రీకాంత్ తరసు దొంగతనాలకు పాల్పడుతూ రెండు ద్విచక్ర వాహనాలు దొంగిలించి వాటిపై కోదాడ పట్టణ పరిధిలో అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 39 సిలిండర్లను దొంగతనాలకు పాల్పడినాడు .ఈ సందర్భంగా శుక్రవారం కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో పట్టణ సీఐ రాము ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి తెలిపిన వివరాల ప్రకారం కోదాడ టౌన్ ఎస్సై రంజిత్ రెడ్డి సిబ్బందితో కోదాడ పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కాలనీ మేళ్లచెరువు రోడ్డు నందు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక యూనికాన్ వాహనంపై గ్యాస్ సిలిండర్ వేసుకొని వెళుతున్న వ్యక్తిని పోలీసులు అనుమానించి వెంబడించి పట్టుకున్నారు.
సదరు వ్యక్తిని విచారించగా పరిసర ప్రాంతాలలో 39 సిలిండర్లను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు అతని వద్ద నుండి పోలీసులు 23 సిలిండర్లను రికవరీ చేసినట్లు తెలిపారు దొంగ శ్రీకాంత్ పై గతంలో ఏడు కేసులు నమోదయున్నయని కాగా అతని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఆ దొంగను పట్టుకోవటంలో చాకచక్యంగా ప్రదర్శించిన కోదాడ పట్టణ సీఐ రాము ఎస్సై రంజిత్ రెడ్డి, సైదులు, క్రైమ్ టీం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్ సతీష్ నాయుడు యల్లారెడ్డి లను కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి అభినందించి రివార్డ్ అందజేశారు.