Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SI Shobhan Babu: ఓపెన్ హౌస్ పై విద్యార్థులకు అవగాహన. కలిగించిన. ఎస్సై. ఎం శోభన్ బాబు

SI Shobhan Babu: మునుగోడు ప్రజా దీవెన అక్టోబర్ 25. పోలీస్ వ్యవస్థ (Police System) పనితీరుపై, విద్యార్థులు విధిగా అవగాహన కలిగి ఉండాలని నాంపల్లి ఎస్సై ఎం శోభన్ బాబు (SI Shobhan Babu) అన్నారు. పోలీసుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ పాఠశాల (Gandhiji School)విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని అన్నారు అనంతరం స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారుడు.

రాతపూర్వకంగా (writing)వ్రాసి ఇచ్చిన ఫిర్యాదులోని విషయాన్ని అందులో ఉన్న విషయాన్ని బట్టి కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు స్టేషన్ పరిధిలోని రిసెప్షన్ లాకప్ సెల్ (Reception lockup cell) కేసులు నమోదు వివరాల పట్టిక స్టేషన్ పరిధిలోని మండలంలోని వివిధ రూట్ల వివరాలను కేసుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యనబసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పారు మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు దూరంఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ నరసింహ (ASI Narasimha) శ్రావణ్ కుమార్ సైదులు పాఠశాల ఉపాధ్యాయులు. గాదెపాక రవీందర్. పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు