–చికిత్స పొందుతూ అశ్వారావు పేట ఎస్సై మృతి
–ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్
–శ్రీను మరణంతో అతని మేనత్త గుండెపోటుతో మరణం
SI Suicide Case: ప్రజా దీవెన, భద్రాద్రి కొత్తగూడెం: అధికారుల వేధింపులు (Harassment by officials) భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ (SI Sriramula Srinivas)కిత్స పొందుతూ మృతి చెందాడు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో (Secunderabad Yashoda Hospital)చికిత్స పొందుతున్న శ్రీని వాస్ ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
ఎస్సై శ్రీనివాస్ (SI Sriramula Srinivas) పురుగుల మందు తాగడంతో రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతి నడం తో డయాలసిస్ చేశారని, లి వర్ కూడా దెబ్బతిందని ఆయన బంధువులు తెలిపారు. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ (SI Sriramula Srinivas) స్వగ్రామం వరంగల్ జిల్లా నల్ల బెల్లి మండలం నారక్క పేట కాగా శ్రీనివాస్ మృతితో గ్రామంలో ఎలాంటి ఆందోళన జరగకుండా ఆయన మిత్రులు, ప్రతిపక్ష, వామపక్ష, దళిత సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గ్రామాన్ని పోలీసులు (police)ఆధీనంలో కి తీసుకున్నారు. శ్రీని వాస్ కు భార్య, కుమార్తె, కుమా రుడు ఉన్నారు. కాగా ఎస్సై శ్రీను మరణ వార్త విని అతని మేనత్త ధార రాజమ్మ (60)కు గుండెపోటు వచ్చి చనిపోయింది. మృతురాలిది దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామం అని బంధువులు తెలిపారు.