SID Sayyidulu : ప్రజా దీవెన, శాలిగౌరారం: విద్యా ర్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని శాలిగౌరారం ఎస్ ఐ డి. సైదులు అన్నారు. శాలి గౌరారం మండలం మాదారం ప్రాథ మిక పాఠశాలలో శాలిగౌరారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సీనియర్ లీడర్ రేపాల మదన్ మోహన్ సహకారం తో విద్యార్థుల కు ఎస్ ఐ సైదులు స్పోర్ట్స్ కిట్స్ ను అందజేశారు. ఈ సందర్బంగా ఎస్ ఐ సైదులు మాట్లాడుతూ విద్యార్థు లు చెడు అలవాట్లకు,మొబైల్, టీవీ సీరియళ్లకు బానిసకావొద్ద న్నా రు. మద్యం, మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.
క్రమ శిక్ష ణ తో చదువు కొని ఉన్నత శిఖరా లను అధిరోహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు పున్న శ్రీనివాస్, లయన్స్ క్లబ్ చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారా యణ, మెంబర్స్ గుండ్ల రామ్మూర్తి, దామెర్ల శ్రీనివాస్, ఉపాధ్యాయు లు, డి. రామ్మూర్తి,పిఈటి మయూ బ్, విద్యార్థులు పాల్గొన్నారు.