–ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యో గులకు ప్రశంస పత్రాలు అందజేత
–బహుమతులతో సత్కారం, స్వీ ట్లు పంపిణీ చేసిన యాజమాన్యం
— ఆనందంతో కార్మికులతో కలిసి నృత్యం చేసిన జిఎం
–ఉత్పత్తిలో తన రికార్డును తానే తిరగరాసిన ఏకైక గని పీకే ఓసి
–అభినందన సభలో మణుగూరు ఏరియా జిఎం రామచందర్
singareniEmployees: ప్రజా దీవెన, మణుగూరు: పీకే ఓసి గని ఉత్పత్తి లో తన రికార్డును తా నే తిరగరాసిన నేపధ్యంలో ప్రకాశం ఖని ఉద్యోగుల అభినందన సభ గురువారం ఘనంగా జరిగింది. గత నాలుగేళ్ల నుండి సింగరేణి కంపెనీ లెవల్ లో బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అవార్డు అందుకుం టు వస్తున్నది. ఈ ఏడా ది కూడా పీకే ఓసి ఒకవైపు ఉత్ప త్తిలో, మరో వైపు యాంత్రిక సామ ర్ధ్య వినియోగంలో మొదటి స్థానం లో ఉండడంతో మరోసారి అవార్డు ను ఖాయం చేసుకున్నది. ఈ నేప థ్యంలో పీకే ఓ సి ప్రాజెక్టు ఆఫీసర్ లక్ష్మీపతి గౌడ్ ఆధ్వర్యంలో గురు వారం పీకే ఓసి ఉద్యోగులకు న్యూ సైట్ ఆఫీస్ లో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా జిఎం రామ చందర్ హాజరయ్యారు. ఉద్యోగు లకు ప్రశంస పత్రాలతో పాటు స్వీ ట్లు, బహుమతులు అందజేశారు. సింగరేణి డే డిసెంబర్ 23 న యాం త్రిక సామర్థ్య వినియోగం (Equip ment capacity utilization) లో బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డును పీకే ఓసి 2 అందుకుంది. ఈ ఏడాది కూడా 2024-25 ఆర్థిక సంవత్సరం లో మరోసారి బెస్ట్ పర్ఫామెన్స్ అ వార్డును అందుకోనుంది.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉ ద్యోగులకు ప్రశంస పత్రాలు… 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రకాశం ఖని ఉద్యోగుల అందరికీ ప్రశంస పత్రాలు జిఎం చేతుల మీదుగా అందజేశారు. ప్రతి సెక్షన్ వారిగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యో గులకు ప్రశంస పత్రాలు ఇచ్చారు. వీరితోపాటు ఏడాదిలో ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఉద్యోగు లకు బహుమతులతో పాటు, స్వీ ట్స్, ప్రశంస పత్రాలను ఇవ్వడం జ రిగింది. అలాగే ఉద్యోగులతో చ ర్చించే సమయంలో సంస్థ ప్రయో జనం కోసం ఉత్తమ సలహాలు ఇ చ్చిన ఇద్దరికీ స్పెషల్ గిఫ్ట్స్ కూడా అందజేశారు.
సింగరేణి సి అండ్ ఎండి బల రాం సార్ మాటలు స్ఫూర్తి…
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటె డ్ సి అండ్ ఎండి బలరాం సార్ మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీపతి గౌడ్ తెలి పారు. దీని ఫలితమే పీకే ఓసి కంపె నీ లెవ ల్ లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇ స్తున్నది. ప్రతి వీడియో కాన్ఫరెన్స్ లో బల రాం సార్ కోల్ ఇండియా తో పో ల్చుకుంటే మన బొగ్గు అ మ్మకం ధర ఎక్కువగా ఉంది. మన వినియోగ దారులను కాపాడుకోవా లంటే అ మ్మకం ధర కూడా తగ్గిం చాల్సిన పరిస్థితికి చేరుకున్నామని అన్నారు. మారుతున్న పరిస్థితుల కు అనుగుణంగా మనం మారాల్సి న అవసరం ఉందని చెప్తుంటారు. దీంట్లో భాగంగానే ఉత్పత్తి వ్యయం తగ్గిం చాలని పదేపదే చెప్పారు. దీనికి ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవ సరం లేదు కేవలం ఎనిమిది గంట ల సమయాన్ని పూర్తిస్థాయి లో సద్వినియోగం చేసుకుంటే మ నం లాభాల్లో కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ని త్యం ఉద్యోగులతో చర్చిస్తూ వారి కి దిశ నిర్దేశం చేస్తూ వచ్చానని పే ర్కొన్నా రు. దాని ఫలితం 2024 25 వార్షిక సంవత్సరంలో యాంత్రిక సామర్ధ్య వినియోగంలో ప్రథమ స్థా నంలో ఉన్నామని గర్వంగా చెప్తు న్నాను.
రక్షణతో కూడిన ఉత్పత్తి మన లక్ష్యం….రక్షణతో కూడిన ఉత్ప త్తి మన లక్ష్యమని మన ఏరియా జిఎం రామచందర్ స్పష్టం చేశారు. గురువారం పీకే ఓ సి 2 లో ఏర్పా టు చేసిన అభినందన సభకు ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత వార్షిక సంవత్సరంలో మణు గూరులో ఎక్కువ వర్షాలు పడడం , equipment యంత్రాల సమస్య లతో ఉత్పత్తిలో కొంత వెనుకబడ డం జరిగింది. ఈసారి మనం 100 శాతం చేరుకుంటామా లేదా అను మానం ఉండగా, ఎండి మణుగూ రు ఎప్పుడు వెనుకబడడం చూ డలేదని ఈసారి కూడా చూడబో మని తెలిపారని పేర్కొన్నారు. చివ రి మూడు నెలలు నిరంతర కృషితో మన మణుగూరు 100 శాతం ఉ త్పత్తి సాధించిందని తెలిపారు. ఈ ఏడాది 115 లక్షల టన్నుల ఉత్ప త్తి లక్ష్యాన్ని ఇచ్చారు. దాన్ని కూ డా ఉద్యోగుల కృషితో సాధిస్తామని ధీమ వ్యక్తం చేశారు. అయితే తన రికార్డును తానే తిరిగి రాసే ఏకైక గని పీకే ఓసి స్పష్టం చేశారు. ఒక రోజులో 1,04,000 క్యూబిక్ మీట ర్ల ఓబి తీస్తే అద్భుతం అనుకుంటే తర్వాత మరోసారి 1, 05,805 క్యూబిక్ మీటర్ల ఓబి తీసి పీకే ఓసీ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆ నందం వ్యక్తం చేశారు. ఇది ఒరవడి మున్ముందు కొనసాగాలని ఆకాం క్షించారు.
ఉద్యోగులతో కలిసి నృత్యం చేసిన జిఎం పీకే ఓ సి వరుసగా నాలుగు సంవత్సరాలు బెస్ట్ పెర్ఫా ర్మెన్స్ అవార్డు అందుకొని మరోసా రి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినందుకు సంతోషంగా ఉందని తమ ఆనం దం వ్యక్తం చేశారు జిఎం. ఈ క్రమం లో ఈ సంతోషాన్ని ధూంధాంగా చే సుకోవాలని కార్మికులకు తెలపగా వెంటనే స్టేజి మీదికి వచ్చిన ఉద్యో గులు జిఎంతో కలిసి చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉద్యో గుల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ రాం గోపాల్, ప్రాతినిత్య సంఘం
ఐ ఎన్ టియుసి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు, సిఎంఓఐ బ్రాంచ్ అధ్యక్షులు కృష్ణమూర్తి , ఏరియా సివిల్ ఏజీఎం వెంక టేశ్వర్లు, ఏరియా ఇంజనీర్ శ్రీనివాస్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ వెంకట్ రామారావు, ప్రాజెక్టు ఇంజనీర్ వీరభద్రుడు, పి కే ఓ సి ఆపరేషనల్ మేనేజర్ సురేష్ కుమార్, ఎస్ ఓ టు జి ఎం శ్యాంసుందర్ , డీజీఎం ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనురాధ, ఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ కుమార్ స్వామి, ఐ ఎన్ టియూసి పిట్ సెక్రెటరీ మల్లికార్జున్ హాజర య్యారు.