Singer kalpana : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రము ఖ నేపథ్య గాయని కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని కూకట్పల్లి హో లిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యు లు హెల్త్ బులెటిన్ విడుదల చేశా రు. గాయని కల్పన నిద్రమాత్రలు మింగిందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. ఆమెకు ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నామని, ప్రస్తుతం సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ చైతన్య తెలిపారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు ఆపస్మారక స్థితిలో ఉన్న సింగర్ కల్పనను హాస్పిటల్‌కు తీసుకు వచ్చారని డాక్టర్ చైతన్య తెలిపారు. నిద్ర మాత్రలు ఎక్కువ తీసుకు న్నారని చెప్పారు.. మాత్రల డోస్ ఎక్కువ అవ్వడంతో.. స్టమక్ వాష్ చేసామని.. బ్రీతింగ్ సమస్యలకు పరీక్షలు చేసి.. పలమనరి సమస్యకు చికిత్స అందించామని తెలిపారు. అత్యవసర పరిస్థితిలో 12 గంటలు వెంటిలేటర్ పెట్టామని.. ప్రస్తుతం వెంటి లేటర్ తీసేసామన్నారు. లంగ్ ఇన్ఫెక్షన్ ఉందని.. ఆ సమస్యను క్లియర్ చేస్తామన్నారు. ప్రస్తుతం కల్పన ఆక్సిజన్‌పై ఉన్నారని.. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చైతన్య తెలిపారు. మరోవైపు సింగర్ కల్పన కేసులో కేపీహెచ్‌బీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె నిద్ర మాత్రలు వేసుకున్నారు.
దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. కాగా బుధవారం కల్పన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. హైదరాబాదులో సింగింగ్‌తో పాటు లా కూడా చేస్తున్నారు. తన పెద్ద కూతురును హైదరాబాదుకు రావాలని కల్పన కోరారని అయితే తాను హైదరాబాదుకురానని కేరళలోని ఉంటానని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగినట్లు తెలియవచ్చింది. కాగా సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నానికి కల్పన పాల్పడ్డారు. రోజూ వేసుకునే నిద్ర మాత్రలను ఎక్కువ మోతాదులో తీసుకున్నారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు కల్పనకు భర్త ప్రసాద్ ఫోన్ చేశారు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విల్లా సెక్రటరీకి కాల్ చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కల్పనను హాస్పటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
నా తల్లి ఆత్మహత్మయ త్నా నికి పాల్పడలేదు …. కల్పన ఆత్మహత్యాయత్నంపై ఆమె కూ తురు స్పందించింది. కల్పన ఆత్మ హత్యాయత్నంపై సమాచారం అందుకున్న ఆమె కూతురు.. హుటాహుటిన కేరళ నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరి పోలీసులకు కల్పన కూతురు ఏం చెప్పింది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. కల్పన ఆత్మహత్యాయత్నంపై ఆమె కూతురు స్పందించింది. తన తల్లి కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపింది. నిద్రమాత్రలు ఓవర్ డోస్ వేసుకుందన్నారు. డాక్టర్ సూచించిన నిద్రమాత్రలే వేసుకుందని వివరించింది. మానసిక ప్రశాంతత కోసం నిద్రమాత్రలు వేసుకుంటోందని కల్పన కూతురు తెలిపింది. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యా లేదన్నారు.
తన తల్లి కల్పన హైదరాబాద్‌లో లా పీజీ చేస్తోందని వివరించింది. కల్పన మానసిక ఒత్తిడికి గురవుతూ, నిద్రలేమి సమస్యతో బాధపడేదని పేర్కొంది. కల్పన పెద్ద కూతురు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. అంతకుముందు.. కేరళ నుంచి హైదరాబాద్ రమ్మంటే కూతురు రావడం లేదని కల్పన మనస్థాపనం చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేరళ వెళ్లిన సందర్భంలో కూడా ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవలు జరిగాయట. హైదరాబాద్‌కి వచ్చిన తరువాత మరోసారి కూతురుని తన వద్దకు రావాలని కల్పన కోరిందట. అయినప్పటికీ ఆమె అంగీకరించలేద. దీంతో తన కూతురు తన మాట వినడం లేదని కల్పన మనస్తాపానికి గురైందని, అలా నిద్ర మాత్రలు వేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కల్పన మొదటి భర్త కూతురు కేరళలో చదువుతోంది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చేయాలని కల్పన ఆమెను అనేకసార్లు కోరింది. ఈ విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.