ప్రజా దీవెన, వరంగల్: దీర్ఘకాలికంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ కిడ్నీలు దెబ్బతిని తీవ్ర ఆనారోగ్యంతో బలగం సినిమా ఫేమ్ మొగిలయ్య దుగ్గొండిలో మృతి చెందారు. కమీడియన్ గా మంచి గుర్తింపు పొందిన వేణు యెల్ధండి దర్శక త్వంలో దిల్ రాజు బ్యానర్ పై నిర్మించిన బలగం సినిమా తెలం గాణ లో ఎంత ప్రభంజనం సృష్టిం చిందో అందరికి తెలిసిందే. ఈ సిని మాలో క్లైమాక్స్ సాంగ్ తోడుగా మా తో ఉండి నీడగా మాతో నడిచి పాట ప్రజల గుండెలను హత్తుకుం ది. ఈ పాటనే సినిమాకు గుండెకా య అయ్యింది.
ఈ పాట పాడిన వరంగల్ జిల్లా దుగ్గొండి కి చెందిన కొంరమ్మ, మొగిలయ్య దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచుర్యంలోకి వచ్చారు. కొంరమ్మ భర్త మొగిల య్య ఈరోజు తెల్లవారు జామున ఆనారోగ్యంతో మరణించారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమి త్తం బలగం సినిమా డైరక్టర్ వేణు యెల్ధండి, చిత్ర యూనిట్ తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది. ఈ మధ్యే పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్ లో మం త్రి పొన్నం ప్రభాకర్ మొగిలయ్య దంపతులకు ఇంటి స్థలతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ మధ్యే రూ.లక్షా ఆర్థిక సాయం అందించారు. మొగి లయ్య మరణం పట్ల బలగం సిని మా డైరక్టర్ వేణు యెల్ధండి, నటి నటులు సంతాపం ప్రకటించారు.