Sitaiah: ప్రజాదీవెన,కోదాడ:తెరసాంస్కృతిక కళామండలి ఆధ్వర్యంలో బుధవారం కోదాడ పట్టణములో తేజ టాలెంట్ పాఠశాల ఆవరణలో సూర్యాపేట జిల్లా సమగ్ర స్వరూపం” గ్రంథావిష్కరణ మరియు సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు వంగవీటి రామారావు అభినందన కార్యక్రమని నిర్వహించారు తెర గౌరవ సలహాదారులు పార సీతయ్య (Sitaiah) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా కోదాడ డి.ఎస్.పి. మామిళ్ళ శ్రీధర్ రెడ్డి (D.S.P. Mamilla Sridhar Reddy), హైదారాబాద్ డి.ఎస్.పి.యం.సోమనాథం పాల్గొని ముందుగా జిల్లా చరిత్ర గ్రంథావిష్కరణను చేసినారు అలాగే సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావును “తెర” ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించార ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రంథ పఠనం ద్వారా విజ్ఞాన సంపద పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ నిరంతరం పాఠకులుగా పయనించాలన్నారు. సూర్యాపేట జిల్లా చరిత్ర గ్రంథం చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుందని, సాంస్కృతిక సాహిత్య సామాజిక వైభవాన్ని అధ్యయనం చేయవచ్చని ఆయన అన్నారు.
ప్రధాన వక్తగా “మనం వికాస వేదిక” అధ్యక్షులు, కవి, సుధా బ్యాంకు ఎం.డి. పెద్దిరెడ్డి గణేష్ పాల్గొని మాట్లాడుతూ… సూర్యాపేట జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథం జిల్లా చరిత్రను మన ముందు ఉంచుతుందని, వివిధ రంగాలకు సంబంధించిన వ్యాసాలు ఇందులో ఉన్నాయని, పరిశోధన చేసే విద్యార్థులకు, పోటీ పరీక్షలకు (students, competitive exams) సిద్ధమయ్యే వారికి ఈ గ్రంథం ఉపయోగకరంగా ఉంటుందని, మన జిల్లా ఉన్నత్యాన్ని ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. అలాగే నూతనంగా జిల్లా గ్రంథాలయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వంగవీటి రామారావుని అభినందించారు.
అలాగే ఉత్తమ వార్డెన్ అవార్డు (Best Warden Award) గ్రహీత పద్మను, సంగీత దర్శకుడు కోదాడ కొండల్ ను, సంస్థ సన్మానించింది. “తెర” సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు సమన్వయకర్తగా జరిగిన ఈ కార్యక్రమములో… చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ముత్తవరపు పాండురంగారావు, బద్దం భద్రారెడ్డి, ఓరుగంటి వెంకట బ్రహ్మం, షేక్ మీరా, పాలూరి సత్యనారాయణ, గుండెల సూర్యనారాయణ, బాల్రెడ్డి, తేజ జానకి రాములు, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, పంది తిరపతయ్య, చందా శ్రీనివాసరావు, నామా నాగేశ్వరరావు, కోదాడ కొండల్, వేల్పుల తీరూప్, షేక్ రహీం, గార్లపాటి వీరారెడ్డి, షేక్ .పీర్ సాహెబ్, జి.వి. రాజు, సిరికొండ నరసింహారాజు, పుప్పాల కృష్ణమూర్తి మొదలగువారు పాల్గొన్నారు.