–టీ సేఫ్ యాప్ ను తన ట్విట్టర్ ఖాతాలో అప్ లోడ్ చేసిన హిరోని అభినందిన మంత్రి
Sitakka: ప్రజా దీవెన, హైదరాబాద్: అమ్మాయిలు, మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మార్చి 12 2024లో, టీ సేఫ్ అనే యాప్ ను లాంచ్ చేశారు. ఇప్పటివరకు 15,000 మందికిపైగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసు కున్నా రు. మహిళల ప్రయాణ సమయం లో, పని ప్రాంతాల్లో (During travel time, work areas) వారి భద్ర త కోసం ఈ యాప్ పనిచే స్తోంది. అపాయంలో ఉన్న మహిళలను గుర్తించి వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలా ఈ యాప్ పనిచేస్తోంది. స్మార్ట్ ఫోన్ లో కాకుం డా, సాధారణ ఫోన్ల ద్వారా కూడా టి సేఫ్ పనిచేస్తోంది.
మహిళలకు (womans)ఎంతో ఉపయోగకరంగా ఉన్నా ఈ యాప్ ను అభినందిస్తూ హీరో మాధవన్ టి సేఫ్ ప్రచార వీడియో ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కోల్ కత్తా మహిళా డాక్టర్ హత్య నేపథ్యంలో టి సేఫ్ దేశ వ్యాప్తంగా మరోసారి చర్చలోకి వచ్చింది. టి సేఫ్ యాప్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఏడు రాష్ట్రాలు ముందు కొచ్చాయి. ఇతర రాష్ట్రాల కు టి సేఫ్ యాప్ ఆదర్శంగా మా రటం, ప్రముఖ హీరో మాధవన్ తన ట్విట్టర్ (twitter) అకౌంట్లో టి సేఫ్ వీడియో ను అప్లోడ్ చేసి ప్రమోట్ చేయడం పట్ల మంత్రి సీతక్క (Sitakka) హర్షం వ్యక్తం చేశారు. అమ్మాయిలు మహిళలు ఈ యాప్ ను వినియోగించాలనీ సూచించారు. మరింతగా ఈ యాప్ ను వినియోగంలోకి తెచ్చేలా విస్తృ తంగా ప్రచారం చేయాలని అధికా రులకి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.