–అసెంబ్లీలో పంచాయతీరాజ్ మంత్రి సీతక్క
–6176 గ్రామపంచాయతీలకు శాశ్వత భవనాలు లేవు
–నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుపై చర్చించి నిర్ణయం
Sitakka:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా 1851 ఆవాస గ్రామాలు, తాండాలను (Residential villages, Tandas) గ్రామ పంచాయతీగా మార్చినట్లు రాష్ట్ర పంచాయ తీరాజ్‌శాఖ మంత్రి సీతక్క (Sitakka) వెల్లడిండిచారు. బుధవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సీతక్క జవాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర గ్రాంట్లతో సమానంగా రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్లను (ఎస్ఎఫ్‌సి) విడుదల చేస్తోంది. సంవత్సరానికి 5 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షికాదాయం వున్న పంచాయతీలకు అదనంగా 5 లక్షల రూపాయల నిధులు విడుదలవుతున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శిని ప్రభుత్వం నియమించింది.
అన్ని గ్రామ పంచాయతీలు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్, శ్మశానవాటిక, క్రీడా ప్రాంగణం (Tractor, Trolley, Tanker, Nursery, Rural Nature Forest, Segregation Shed, Cemetery, Sports Ground) ఉన్నాయని మంత్రి చెప్పారు. 6176 గ్రామపంచాయతీలకు శాశ్వత భవనాలు లేవని, త్వరలో నిర్మిస్తామని ఆమె చెప్పారు. గ్రామంలో మల్టీపర్పస్ వర్కర్లు, పారిశుధ్య కార్మికుల వేతనల కోసం రూ. 378.88 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మారుమూల తండాల్లో రోడ్డు విద్యుత్ విద్యావ్యవస్థ లు సరిగా లేవు. ఇతర వర్గాల ప్రజలతో సమానంగా మారుమూల తండాల ప్రజల జీవన పరిస్థితులను మెరుగు పరుస్తాం. అక్కడ రోడ్లు, విద్యుత్, విద్య వ్యవస్థలను మెరుగు పరస్తాం. త్వరలో బడ్జెట్ కేటాయింపులు చేసి అభివృద్ధి చేస్తాం.1936లో ల్యాండ్ సర్వే చేశారు. తర్వాత ల్యాండ్ సర్వే చేయలేదు. అందుకే చాలా గ్రామపంచాయతీలు రెవెన్యూ పంచాయతీలుగా (Revenue Panchayats) మారలేదు. గ్రామ పంచాయతీలను రెవిన్యూ పంచాయతీలుగా మార్చేందుకు రెవెన్యూ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క (Sitakka) వెల్లడించారు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.