Group-1 Prelims: గ్రూప్-1 ప్రిలిమ్స్ లో ‘ ఆరు గ్యారెంటీలు’
తెలంగాణలో 563 గ్రూప్–1 పోస్టు ల భర్తీ కోసం ఆదివారం టీజీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్ర శాంతంగా ముగిసింది
గతంతో పోలిస్తే కొద్దిగా సులువైన ప్రశ్నలు
ప్రశాంతంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో 563 గ్రూప్–1 (Group-1 post)పోస్టు ల భర్తీ కోసం ఆదివారం టీజీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్ర శాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సుమారు 74శాతం మంది అభ్యర్థు లు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి పరీక్షలో ప్రశ్నలు కొంతమేర సులువుగా ఉన్నాయని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సులు వుగా,నేరుగా సమాధానమిచ్చే ప్రశ్న లను ఈసారి ఎక్కువగా అడిగారు. దీంతో మెయిన్స్‌కు ఎంపిక చేసే క టాఫ్ మార్కులు పెరగవచ్చని భావి స్తున్నారు. రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి గతంలో నిర్వహించి న ప్రిలిమినరీ (Group-1 Prelims)పరీక్షలను రెండు సార్లు రద్దు చేసిన విషయం తెలి సిందే.
తాజాగా ఆదివారం నిర్వ హించిన ప్రిలిమ్స్(Group-1 Prelims exams) పరీక్ష కు సుమా రు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా సుమారు 3.02 లక్షల మంది (74 శాతం) హాజరయ్యారు. 31 జిల్లాల్లో మొ త్తం 891 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వ హించారు. 150 మార్కులకు ఓఎం ఆర్ షీట్ విధానంలో నిర్వ హిం చారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థు లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని త్వరలో వెల్లడిం చనున్నట్టు అధికారులు చెప్పారు. తర్వాత ఫలితాలను ప్రకటించను న్నారు. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్స్ పరీక్షల కోసం జాబితా ప్రకటించనున్నారు. ఉద్యోగాల సంఖ్య ఆధారంగా 1:50 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేయనున్నారు. ఈ పరీక్ష లను అక్టోబరు 21వ తేదీ నుంచి నిర్వహిస్తారు.
ఆరు గ్యారెంటీల(Six Guarantees )పై ప్రశ్నలు.. కాంగ్రెస్ (Congress govt)ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలపై ప్రశ్నలు పొందు పరిచారు. మహాలక్ష్మి పథకం కింద గృహావసరాలకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరలకు అం దించడానికి సంబంధించి ఒక ప్రశ్న, గృహ జ్యోతి పథకంపై ఒక ప్రశ్న అడిగారు. ఈసారి ఎక్కువ ప్రశ్నల ను సైన్స్ అండ్ టెక్నాలజీపై(Science and Technology) ఇచ్చిన ట్టు అభ్యర్థులు చెప్పారు. చరిత్రకు సంబంధించిన ప్రశ్నలను తగ్గించా రు. గత పరీక్షలో చరిత్రపై 26ప్రశ్న లు ఇవ్వగా, ఈసారి 21 ఇచ్చారు.
ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ పరీక్షా కేంద్రంలో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న మీర్జా పర్వేజ్‌భేగ్ అనే ఉద్యోగి మ ద్యం సేవించి విధులకు రావడంతో పోలీసులు ఆయనను స్టేషన్‌కు తరలించారు. తర్వాత తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో అప్ప గించారు.ఆసిఫాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల (Social Welfare Gurukula Boys College)పరీక్షా కేంద్రంలో ఇద్దరు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ముందే వచ్చినప్పటికీ పాస్‌పోర్టు సైజు ఫొ టోల కోసం బయటికి వెళ్లి ఆల స్యంగా రావడంతో వారిని పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదు.
జగిత్యాలలో 8మంది, కొడిమ్యాల జేఎన్‌టీయూలో ఐదుగురు, రాజ న్న సిరిసిల్ల జిల్లాలో 40 మంది, వికారాబాద్‌లో 20 మంది, తాం డూరులో 8మంది అభ్యర్థులు ఆల స్యంగా వచ్చి పరీక్ష రాయలేకపో యారు. నల్లగొండ,భువనగిరిలో సుమారు 15 మంది నిమిషం నిబం ధనతో వెనుదిరిగారు. అయితే ఇం దులో హాల్‌టికెట్‌పై ఫొటో లేకపో వడంతో ముగ్గురు విద్యార్థులను అనుమతించలేదు.
Six Guarantees in Group-1 Prelims