SLBC Tunnel : ప్రజా దీవెన, నల్లగొండ: శ్రీశైలం సొరంగం ప్రమాద సహాయక చర్య లు ఉత్కంఠ భరితంగా కొనసా గుతూనే ఉన్నాయి. తాజాగా క్షణం క్షణం ఉత్కంఠతతో సాగుతున్న పనులు ఆరో రోజుకు చేరుకున్నా యి. ప్రమాద ప్రారంభం నుంచి నేటి వరకు కొనసాగుతున్న పనుల్లో భా గంగా టన్నెల్‌లో నీటి తోడకం సవా ల్ గా మారింది. నిమిషానికి 5వేల లీటర్ల సీపేజ్ నీటి తోడకంతో పాటు బురద పేరుకుపోతుండడంతో రె స్క్యూ పనులు మరింత క్లిష్టంగా మారాయి. ఆర్మీ, నేవీ, ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, జిఎస్ఐ, సింగరేణి, ర్యాట్‌హోల్ మైనర్స్, బీఆర్వో, ఎల్ అండ్ టితోపాటు పలు బృందాలు రెస్క్యూ ఆపరే షన్ లో తలమునకలై శ్రమిస్తు న్నాయి. బురదలో కూరుకుపోయి న రాళ్లతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది.ఆపరేషన్ పనులను ఎప్పటికప్పుడు పర్యవే క్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి లు రెస్క్యూ చివరి దశకు చేరిందన్నారు. గల్లంతయిన వారిని క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.
రెస్క్యూ ఆపరేషన్స్ కోసం మరో హెలిప్యాడ్ సిద్దం చేస్తున్నారు. ఓవై పు రెస్క్యూ, మరోవైపు అధికారుల రాకపోకలు సాగించనున్నారు. ఇ ప్పటిదాకా ఒకటే హెలిప్యాడ్ ఉండ డంతో రెస్క్యూ పనులకు ఆటంకం కలిగింది. అందుకే రెండో హెలిప్యా డ్ సహాయచర్యలకు ఉపయోగిం చాలని యోచిస్తున్నారు. దోమల పెంట జేపీ గెస్ట్‌హౌస్ దగ్గర ఈ హెలి ప్యాడ్ సిద్దమవుతోంది. ఎస్‌ఎల్‌బీ సీ టన్నెల్ ఘటనకు గల కారణాల పై అన్వేషణ జరుగుతోంది. ఘట నాస్థలానికి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ బృందం చేరుకుంది. పైకప్పు కూలిన చోట మట్టి, రాళ్లు పరిశీలి స్తున్నారు.
టన్నెల్ ప్రమాదం తాజా విజు వల్స్… ఎస్ఎల్బీసీ సొరంగం లో చిక్కుకున్న కార్మికులను రక్షించడా నికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగు తోంది. దాదాపు ఐదు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆ ర్‌ఎఫ్ సిబ్బంది గురువారం నాటికి దాదాపు కార్మికుల సమీపం వరకు చేరుకోగలిగారు. టన్నెల్‌లో భారీగా బురద పేరుకుపోవడంతో దానిని తొలగించే పనులు చేపట్టారు. ఇం దుకు సంబంధించిన లేటెస్ట్ విజువ ల్స్ పై వీడియోలో చూడొచ్చు.
Slbc tunnel accident Latest situation pic.twitter.com/1qzc2oyBRQ
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) February 27, 2025