ఎస్ఎల్బీసీ పనులను మా హయంలొనే పూర్తి చేస్తాం
–సొరంగ మార్గం భూమిని డెన్మార్క్ నుండి హెలికాఫ్టర్ తెప్పించి
ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వే చేయించనున్నాం
–కృష్ణా నది జలాల్లో 70% తెలంగాణకు ఇవ్వాలని కృష్ణ బచావత్ ట్రిబ్యునల్ ముందు ఉంచాం
— తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇచ్చేలా ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
–రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
Slbctunnel: ప్రజా దీవెన, నకిరేకల్: గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కూలిపోయిన ఎస్ ఎల్ బి సి పనులను పునః ప్రారంభించి తమ హయాంలోనే పూర్తి చేసి సాగునీరు అందిస్తామని రాష్ట్ర నీటిపారు దల, పౌరస రఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపా రు. శనివారం ఆయన నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజక వర్గంలోని అయిటిపాముల వద్ద100 కోట్ల రూపాయలతో చేపట్టను న్న ఐటి పాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి సమీక్షించారు.ఎస్ ఎల్ బి సి సొరంగం వెళుతున్న 44 కిలోమీటర్ల భూమిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే చేయించేందుకు డెన్మార్క్ నుండి హెలికాప్టర్ తెప్పించి లైడార్ సర్వే చేయించనున్న ట్లు తెలిపారు .ప్రస్తుతం జరుగుతున్న టన్నెల్ పనులు ప్రపంచం లో నే అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణ, గోదావరి నది జలాల లో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ ,ఖమ్మం రైతాంగంతో పాటు, రాష్ట్ర రైతాంగానికి నష్టం జరిగిందని అన్నారు.కృష్ణ బచావత్ ట్రిబ్యూనల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయిస్తే, గత ప్రభుత్వ హయంలో 512 ఎంసీలు ఆంధ్రకు, 299 టిఎంసిలు తెలంగాణకు సరిపోతుందని రాతపూర్వకంగా ఇచ్చారని,తాము అధికారంలోకి వచ్చాక ఈ కేటాయింపులను పునః సమీక్షించి కృష్ణాజిల్లాలో 70% తెలంగాణకు ఇవ్వాలని బచావత్ ట్రిబ్యునల్ ముందు ఉంచడం తోపాటు, గతంలో ఇచ్చిన తీర్పు కేసును రీ ఓపెన్ చేయించినట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వం కాళేశ్వరం పై పెట్టిన లక్ష కోట్ల ధనం వృధా అయిం దని, కాలేశ్వరం కూలిపోయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలం గాణ చరిత్రలో లేని విధంగా ఈ ఖరీఫ్లో 153 లక్షల మెట్రిక్ టన్ను లు ,యాసంగిలో 130 లక్షల మెట్రిక్ టన్నులు ,మొత్తం 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి భారతదేశంలోనే తెలంగాణ చరిత్ర సృష్టించిందని తెలిపారు. తుమ్మడి హట్టి వద్ద 38 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టెందుకు రాజశేఖర్ రెడ్డి హయాంలో శం కుస్థాపన చేయగా, గత ప్రభుత్వం దీన్ని మూడింతలు పెంచి తు మ్మడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చిందని ,తుమ్మిడి హట్టిలో ప్రాజెక్టు నిర్మించకపోవడం వల్ల 62 వేల కోట్ల రూపాయలు వృధా అయ్యిందని, ఒకవేళ ఈ 62,000 కోట్లు ఆదా అయి ఉంటే ఈ మొత్తంతో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అవకాశం ఉండేదని తెలిపారు.
తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా పనులు చేస్తు న్నామని, కాలేశ్వరంపై విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయడ మే కాకుండా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ చేపట్టామ ని, జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో విచారణకు ఆదేశించా మని అన్నారు . రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేలా ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని , నీటిపారుదల శాఖను పటిష్టం చేయడంలో భాగంగా 1100 మంది ఇంజనీర్లను, 1800 మంది లస్కర్లను నియమించామని తెలిపారు .తమ ప్రభుత్వ హాయంలోనే పాలమూరు- రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తి పోతల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల బిసీ, డిండి తదితర ప్రాజెక్టులన్ని పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తామని అన్నారు.
అయిటి పాముల లిఫ్ట్ ఇరిగేషన్ ను డిసెంబర్ లోగా పూర్తిచేసి 80 00 ఎకరాలకు సాగు నిరంధించనున్నట్లు మంత్రి వెల్లడించారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ విషయంలో రైతులతో చర్చించి ఓపెన్ కాలువ లేదా పైపుల ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశంకు సూచించారు. భూసేకరణ విష యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నదని, భూసేకరణ సాధ్యం కాకపోతే పైప్లైన్ ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విష యంలో స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో మాట్లాడి ఒప్పిం చాలని కోరారు. ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తికి ఏజెన్సీ అధిక ప్రాధాన్య పెంచి డిసెంబర్ లోపు పూర్తిచేసేలా చూడాలన్నారు.
ఉమ్మ డి నల్గొండ జిల్లా పరిధిలోకి వచ్చే గంధమల్ల లిఫ్ట్ ఇరిగేషన్ భూసేక రణ సమస్యను దృష్టిలో ఉంచుకొని లిఫ్ట్ ఇరిగేషన్ సామ ర్థ్యాన్ని తగ్గించి పనులు ప్రారంభించేలా ఆదేశించడం జరిగిందని ,బుణ్యా ధిగాని కాలువ, ధర్మారెడ్డి కాల్వ,పిల్లయి పల్లి కాల్వలకు 50 0 కోట్లు మంజూరు చేసి ఇటీవలే హైదరాబాద్లో సమావేశాన్ని నిర్వ హించి ఈ మూడు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టా మన్నారు.
అలాగే బసవపూర్ ఇరిగేషన్ భూ సేకరణకు వచ్చే నెలలో అవసర మైన నిధులను మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. దిండి ఎత్తిపోతల పథకానికి 1800 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలవడం జరిగిందని , దున్నపోతుల గండిబోత్తలపా లెం తోపాటు, కృష్ణా నదిపై చేపట్టిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి అత్య ధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలి పారు.
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ ఐటిపా ముల ఎత్తిపోతల పథకం కు ఆసిఫ్ నగర్ నుండి లింక్ చేయాలని, నవంబర్ డిసెంబర్ లోపు ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటిపాముల తో పాటు, బసవపురం గంధమల్ల పై దృష్టి సారించి సాగునీరు అం దిస్తే 50,000 ఎకరాలకు నీరు వస్తుందని, అలాగే బ్రాహ్మణ వెల్లే ముల, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయపల్లి కాలువ, బునియాది గాని కాలువ తదితర లిఫ్ట్ల ద్వారా నకిరికల్ ప్రాంతానికి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు రానుందని తెలిపారు. పిల్లాయిపల్లి కాలువ ద్వారా చెరువులు నింపే అవకాశాన్ని కల్పించాలని కోరారు .
మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే 8000 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు.
శాసనమండలి సభ్యులు శంకర నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు లిఫ్ట్ ఇరిగేషన్లు, ప్రాజెక్టుల పూర్తి కికృషి చేస్తున్నదని, ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మూడు మండలా లకు తాగునీరు అందించేందుకు అవకాశం ఉందని తెలిపారు.
నల్గొండ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ మాట్లా డుతూ ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కట్టంగూర్, నకిరేకల్, శాలిగౌరారం మండలాల్లోని 8 వేల ఎకరాలకు సాగునీరు అంద నుందని,ఓపెన్ కెనాల్ ద్వారా సాగునీరు అందించేందుకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కు 101 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, 200 ఎకరాల భూసేకరణ అవసరం ఉందని, ఇందుకు రైతులు సహకరి స్తే డిసెంబర్ లోపే ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని తెలిపారు .
అంతకు ముందు మంత్రి లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టనున్న స్థలాన్ని పరిశీ లించడమే కాకుండా, ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబి షన్ను తిలకించారు.ఉదయ సముద్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీని వాస్ రెడ్డి ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ వివరాలు మంత్రికి తెలి య జేశారు.కాగా ఇరిగేషన్ఇంజనీర్లు, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, స్థానిక తహసిల్దార్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.