*ఉన్నపలంగా వెళ్లగొడితే 100 కుటుంబాలు రోడ్డున పడతాయి
Small businesses: ప్రజా దీవెన, కోదాడ: మున్సిపల్ కార్యాలయం (Municipal Office) పక్కన గల కళ్యాణ మండపం ఏరియాలో చిన్న చిన్న డబ్బా కోట్లలో వ్యాపారం 40 సంవత్సరాల గా చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని దుకాణాలు తొలగించి మా జీవితాలను రోడ్డున పడవేయొద్దని చిరు వ్యాపారుల గౌరవాధ్యక్షులు ఎస్.కె నహీం (SK Nahim) కోరారు మంగళవారం కోదాడ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవికి వినతి పత్రం అందజేసి అనంతరం మాట్లాడారు ఇటీవల నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ పట్టణ అభివృద్ధిలో (Kodada Urban Development) భాగంగా మున్సిపల్ కార్యాలయ నూతన నిర్మాణాలు చేపట్టటానికి ఆరు కోట్లు నిధులు కేటాయిస్తామని చెప్పటంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయి మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని సర్వే నిర్వహించారు.
మున్సిపల్ నూతన కార్యాలయ (Municipal New Office) నిర్మాణం చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మేము గత 40 ఏళ్లుగా ఇదే వ్యాపారాన్ని చేసుకుంటూ మా కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు అలాంటి కుటుంబాలను రోడ్డున పడేస్తే ఆ కుటుంబాలు జీవనోపాధి కోల్పోతారని అన్నారు నూతన నిర్మాణాలు చేపడితే చిన్నచిన్న సెటర్లు వచ్చే విధంగా కట్టించినట్లయితే 100 కుటుంబాలు కూడా జీవన ఉపాధి (Livelihood employment) కల్పించిన వారవుతారని తెలిపారు మేము వ్యాపారాలు నిర్వహిస్తున్నప్పటి నుండి మున్సిపాలిటీ కే పన్నులు చెల్లిస్తున్నామని కావున సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులు మా సమస్యలను ఆలకించి మమ్మల్ని రోడ్డున పడేయకుండా మా కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారుల గౌరవ అధ్యక్షులు షేక్ నయీమ్,గౌరవ సలహాదారులు బొలిశెట్టి కృష్ణయ్య,అధ్యక్షులు పాండురంగారావు,ప్రధాన కార్యదర్శి భూసాని మల్లారెడ్డి,కోశాధికారి ఎండి మహమ్మద్,ఉపాధ్యక్షుడు దస్తగిరి,సహాయ కార్యదర్శి వేణుగోపాలరావు,షేక్ సలీం,హుస్సేన్ బి,హుస్సేన్,షేక్ రహీం,బేగం,సోమయ్య తదితరులు పాల్గొన్నారు.