Sobharani: ప్రజా దీవెన, కోదాడ: చాకలి ఐలమ్మ (Ailamma)సాయుధ పోరాటం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల కళాశాల ప్రిన్సిపల్ కే శోభారాణి అన్నారు చాకలి ఐలమ్మ (Ailamma) 129వ జయంతి ని గురువారం మహాత్మా జ్యోతిభా ఫూలే గురుకుల కళాశాల లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ శోభారాణి ముఖ్యఅతిథిగా పాల్గొని ఐలమ్మ (Ailamma) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ. స్త్రీ (woman)మూర్తులఅందరికి వీరనారి ఐలమ్మ గారు స్ఫూర్తిని ఇచ్చారని గుర్తు చేశారు. ఐలమ్మ పోరాటం ఎందరికో స్ఫూర్తి దాయకంగానిలిచిందన్నారు. ఐలమ్మ ఆశయాలు సాధించినాడే యువత ఆమె కిచ్చే ఘన నివాళులని తెలిపారు ఈ కార్యక్రమం లో ఏ టీ పి గోపాలకృష్ణ, డి.డబ్ల్యూ నరేష్, అప్పారావు, రవి, బ్రహ్మచారి, జ్యోతి, రాధిక, శిరీష మొదలగు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.