–ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
–బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల హర్షం
–క్లాక్ టవర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫ్లెక్సీ లకు పాలాభిషేకం
–మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీ నిర్వహించిన పార్టీ శ్రేణులు
MLC Ketawat Shankar Nayak : ప్రజాదీవెన నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంతుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించి బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాల పార్టీ అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకోవడం సాహోసోపీతే నిర్ణయమని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ శంకర్, జూలకంటి శ్రీనివాస్, ఆలకుంట్ల మోహన్ బాబు, మారగోని నవీన్ గౌడ్, ఆలకుంట్ల నాగరత్నం రాజు, ఇంతియాజ్, శ్రీనివాస్, ఆమీర్, గంగుల సైదులు, సమద్, కత్తుల కోటి, ఇబ్రహీం, గురిజ వెంకన్న, ఇటికాల శ్రీనివాస్, ఇంతియాజ్, మామిడి కార్తీక్, జహంగీర్ బాబా, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, పాదం అనిల్, వజ్జ రమేష్ యాదవ్, నల్లగొండ అశోక్, జలంధర్ రెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, శ్రీనివాస్, పెరిక చిట్టి తదితరులు పాల్గొన్నారు.