Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sonia Gandhi: ఘనంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.

ప్రజా దీవెన, కోదాడ: అమరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ధీరవనిత తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల ,అన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగాఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడిన అమరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగును నడు సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అనంతరం మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని మాయమాటలతో గద్దెనెక్కిన కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని పదేళ్లలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశ చెందారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీఎన్నికల్లో వచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి సంక్షేమం, అభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సోనియా గాంధీ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కే ఎల్ ఎన్ ప్రసాద్, కౌన్సిలర్లు షాబుద్దీన్, కోటిరెడ్డి, సుశీల రాజు మదర్, చందర్ రావు, నిరంజన్ రెడ్డి,కాజా మొయినుద్దీన్, నాగమల్లేశ్వరి, పాలూరి సత్యనారాయణ, గరినే శ్రీధర్,డేగ శ్రీధర్,మహమ్మద్ అజీమ్, బాగ్దాద్, పంది తిరపయ్య,బాగ్దాద్, పిడతల శ్రీను, కంపాటి శ్రీను, పత్తిపాక జనార్దన్,బాబా,నజీర్,ముస్తఫా,బసవయ్య,గంధం పాండు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.