–అసాంఘిక కార్యకలాపాలు గంజా యి, జూదం,పి.డి.యస్ అక్రమ ర వాణ లపై ప్రత్యేక దృష్టి
–నల్లగొండ జిల్లా ఎస్పీ చంద్రపవార్
SP Chandrapawar: ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు పోలీస్ అధికారు లు,సిబ్బంది పారదర్శకంగా పని చేయాలని జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ (SP Chandrapawar) పిలుపునిచ్చారు. జిల్లా ప్రజ ల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, సిబ్బంది అందరూ కలిసి సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి పిర్యాదుదారుని సమస్యను చట్ట పరిదిలో క్షేత్ర స్థా యిలో విచారణ జరిపి బాదితు లకు అండగా ఉంటూ సత్వర న్యా యం జరిగేలా చర్యలు తీసుకో వా లని, పోలీసు శాఖ (Police Department) పైన ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కల్పించే విదంగా పని చేయాలని జిల్లా అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికా రులతో నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిదిలో పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదుదారులతో (complaints) మర్యాదపూర్వకంగా వ్యవరిస్తూ, సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని అన్నారు.
విసిబుల్ పోలిసింగ్ (Visible policin) ద్వారా నేర నియంత్రణ కట్టడి చేయాలని అన్నారు. కమ్మునిటీ పోలిసింగ్ (Community Policing) ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. డయల్ 100 పై ఏదైనా సమాచారం వస్తే వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలి అన్నారు. అదే విదంగా దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ పగలు,రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం,పి.డి.యస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సమా వేశంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, యస్బి డిఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు,సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మి నారాయణ,సి.ఐ లు మరియు యస్.ఐ లు పాల్గొన్నారు.