SP Sarath Chandra : ప్రజాదీవెన, నల్లగొండ: తమ భూమిలో కడీలు ఏర్పాటు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి తమపై దాడి చేశారని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ మండలంలోని అప్పాజిపేట గ్రామానికి చెందిన ఓర్సు నాగభూషణం అతడి భార్య మంగమ్మ తమ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 35లో 1.25ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో ఆటోలో కడీలు తెచ్చి ఏర్పాటు చేస్తుండగా, తవిటి కృష్ణ, గండ మళ్ల కమళాకర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి భూతులు తిడుతూ దాడిచేసినట్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
తమపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీంతో విచాణ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పినట్లు బాధితులు పేర్కొన్నారు. కాగా, సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 30మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు.