SP Sarath Chandra Pawar : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు 01/1/25 నుండి 31/1/25 వరకు ప్రమాద రహిత మాసోత్సవాలను జిల్లా పరిధిలో గల ఏడు డిపోలలోను ఘనంగా నిర్వహించడం జరిగింది.
మాసోత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారము నల్గొండ డిపో గ్యారేజ్ నందు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను ఉమ్మడి నల్గొండ రీజనల్ మేనేజర్ కె.జాని రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరింగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్, డిప్యూటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణీ పాల్గొని మాట్లాడారు. జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ దేశంలోని ఆర్టీసీలలో అతి తక్కువ శాతం ప్రమాదాలు తెలంగాణ ఆర్టీసీలో మాత్రమే ఉందని కొనియాడారు. ఏ సీజన్ లో అయినా కష్టపడి డ్రైవర్లు బస్సులు ఆపరేట్ చేస్తున్నారని, డ్రైవర్లు దేవుళ్ళ తో సమానమని వారు అన్నారు. డ్రైవర్లు స్పీడు కంట్రోల్ చేసుకుని నడపాలని వాళ్లకి సూచించారు మరియు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని కోరారు. ఇలాంటి వారోత్సవాలు మా డిపార్ట్మెంట్లో కూడా కండక్ట్ చేస్తామని తెలియజేశారు.డిప్యూటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణీ పాల్గొని మాట్లాడుతూ ట్రాపిక్ నిబంధనలు పాటిస్తూ, రోడ్డు ఫై ఇతర వాహనాల కదిలికలను గమనిస్తూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలను తగించవచ్చన్నారు. సెల్ మాట్లాడుతూ వాహనాలు నడపోద్డదని సూచించారు.
ఉమ్మడి నల్గొండ రీజనల్ మేనేజర్ కె.జాని రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాలు లేదా బస్సులు మొదలైన ఆస్తులకు నష్టం కలగడంలో భాగమైన ఉద్యోగులకు తగిన శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఆర్టీసీ మరియు అద్దె బస్సుల డ్రైవర్లు అందరికీ పూర్తిస్థాయిలో, నిబంధనల మేరకు వైద్య పరీక్షలు నిర్వహణ, అద్దె బస్సు డ్రైవర్లు అందరికీ నిపుణులచే మంచి డ్రైవింగ్ అలవాట్ల గురించి, నిర్ణీత ప్రమాణాల ప్రకారం, బస్సుల నిర్వహణను పర్యవేక్షణ, బస్సులతో జరిగిన ప్రమాదాలలో ప్రమేయం ఉన్న డ్రైవర్లకు అవసరమైన కుటుంబ సహకారం అందించడానికి కుటుంబ సభ్యులను కౌన్సిలింగ్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.
రీజియన్ స్థాయిలో ముగ్గురు ప్రమాద రహిత డ్రైవర్లను, ప్రతి డిపో నుండి ముగ్గురు చొప్పున ఎంపిక చేయబడిన 19 మంది డ్రైవర్లను ఎస్పీ మరియు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గార్లు ఘనంగా సన్మానించడం జరిగినది. రీజియన్ స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నల్గొండ డిపో నుండి కే .జంగయ్య, ఎం. అంజయ్య, ఎండి.కె.మొఇనుద్దిన్ మరియు డిపో స్థాయిలో 19 మందిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ రీజనల్ మేనేజర్ శ్రీ. జాని రెడ్డి , డిప్యూటీ రీజనల్ మేనేజర్లు మాధవి, శివ శంకర్, డిపో మేనేజర్లు, అకౌంట్స్ ఆఫీసర్, మరియు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.