జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra Pawar : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా సైబర్ క్రైమ్ సంబంధించిన సమస్యల సందేహాలు తెలుసుకొనుటకు డయల్ యువర్ సైబర్ నేస్తం అనే కార్యక్రమం ద్వారా ప్రతి సోమవారం ఉదయం 11.00 గంటల నుంచి 2.00 గంటల వరకు నిర్వహించబడుతుందని జిల్లా ఎస్పి ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు చేతిలో మోసపోయిన బాధితుల సమస్యల పరిష్కార మార్గాలు తెలుసుకొనుటకు ఫోన్ నంబర్ 8712658079 కి చేయగలరని తెలిపారు.