SP Sarath Chandra Pawar : డిండి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra Pawar : ప్రజాదీవెన,డెవరకొండ : దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని డిండి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిసరాలు, స్థితిగతులు గురించి యస్ఐ ని అడిగి తెలుసుకుని, రిసెప్షన్, స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ, భాదితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరిoచి బాధితులకు తగు న్యాయం జరిగేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని, సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వస్తే తగు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలగజేసేల పని చేయాలని,అప్పుడే ప్రజలలో పోలీస్ శాఖ పైన నమ్మకం కలుగుతుంది అన్నారు.అనంతరం పోలీసు స్టేషన్లో నిర్వహించిన మీట్ యువర్ ఎస్పి కార్యక్రమానికి మండల పోలీసు స్టేషన్ పరిధిలోని విశేష స్పందన వచ్చింది.
మండల పరిధిలోని దాదాపు 26 మంది పిర్యాదు దారులు ఎక్కువగా భూ సమస్యలు,కుటుంబ వివాదాల పైన,జాబ్ ఇప్పిస్తామని మోసం చేశారని, సైబర్ క్రైమ్ మోసలు వివిధ సమస్యల పట్ల యస్. పి ని కలవడం జరిగింది.జిల్లా ఎస్పి పిర్యాదారులతో వారి సమస్యల పట్ల ముఖాముఖి మాట్లాడి, పరిశీలించి సత్వర పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలు జిల్లా కేంద్రానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారని దీని కొరకు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిస్కరించుటయే ద్వేయంగా ఈ యొక్క ప్రోగాం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ ల పరిదిలో మీట్ యువర్ ఎస్పి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తక్షణ పరిష్కారం కొరకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట ఏఎస్పి మౌనిక,డిండి సి.ఐ సురేష్, యస్.ఐ రాజు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.