Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sarath Chandra Pawar : రోడ్డు ప్రమాదాల నివారణకు మరమ్మతులు

SP Sarath Chandra Pawar : ప్రజాదీవెన, నల్గొండ : నల్లగొం డ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు త్రిబుల్ ఆర్ కార్యక్రమం ప్రారంభించి జాతీయ,రాష్ట్రీయ రహదారులు, ఆర్ అండ్ బి పంచా యతి రాజ్ రోడ్డు గ్రామాల మధ్య నుంచి వెళ్లే 109 గ్రామాలను గు ర్తించి ఆ గ్రామాల ప్రజలు మరియు వాహనదారులు రోడ్డు దాటుతు న్న క్రమంలో అనేక ప్రమాదాలకు గురవుతున్నా రని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ ప్రమాదాల నివారణకు త్రిబుల్ ఆర్ నూతన కార్యక్రమం ద్వారా సంబంధిత పోలీస్ అధికా రులు,రోడ్డు సేఫ్టీ వింగ్ మరియు పోలీస్ కళా బృందం ద్వారా ప్రజ లకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 41 బ్లాక్ స్పాట్ గుర్తించి ప్రమా దాల నివారణా చర్యలలో భాగంగా గతంలో నల్లగొండ నుంచి చౌటు ప్పల్ వెళ్లే ఎండీ ఆర్ రోడ్డు కాంచనపల్లి గ్రామ శివారులో ఉన్న ఏఎ మ్ఆర్ ప్రాజక్ట్ కాలువ బ్రిడ్జి పై ఇరువైపులా సేఫ్టీ గోడ లేనందున తరుచూ అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రాంతాన్ని జిల్లా ఎస్పి గుర్తించి సంబంధిత అధికారులుతో ప్రమాదాల నివా రణకు ఇరువైపుల గోడ నిర్మించటం జరిగింది.

అలాగే మునుగోడు నుంచి నార్కట్పల్లి ఆర్& బి రోడ్డులో గల సిం గారం గ్రామ శివారులో ఉన్న మూల మలుపు వద్ద బావిలో వాహనా లు పడి ప్రమాదాలు జరుతుండగా అట్టి ప్రదేశాన్ని గుర్తించి సంబంధి త అధికారులతో బావిని పూడిపించి ప్రమాదాలు జరగకుండా నివా రణా చర్యలు తీసుకోవడం జరిగింది.అలాగే మాల్ నుంచి మల్లేపల్లి రాష్ట్రీయ రహదారి పై తొమ్మిది మూలమలుపుల వద్ద కంపచెట్ల ఉం డడం వాహనదారులకు వల్ల కనిపించకపోవడం కారణంగా తరుచూ ప్రమాదాలు జరుగుతుండగా అట్టి ప్రదేశాన్ని గుర్తించి సంబంధిత అధికారులతో తొలగించడం జరిగింది.

అలాగే మల్లపల్లి నుంచి కొండబీమన పల్లి ఉన్న జాతీయ రహదారి పై మూల మలుపుల వద్ద ఉన్న కంపచెట్లు తొలగించి మరియు వేగా నియంత్రణ చర్యలు,చూచిక పలకలు ఏర్పాటు చేయడం జరిగిందనీ ఇంకా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ ఈ సందర్భంగా తెలిపారు.