— నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
SP Sarath Chandra Pawar : ప్రజాదీవెన, నల్గొండ :జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణా చేసిన అక్రమ డంపింగ్ చేసిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్నారు. శాలిగౌరారం పోలీస్ స్టేషన్ మండల పరిధిలోని ఇసుక రీచ్ లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారినైనా రూపేక్షించేది లేదని, అక్రమ రవాణా అక్రమ డంపింగ్ చేసే వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇసుక రవాణా చేయరాదని, ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు తెలిస్తే డయల్ 100 గాని సంబంధిత పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించవలసిందిగా పేర్కొన్నారు.