Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sarath Chandra Pawar : జిల్లాలో పనిచేస్తున్న 10 మంది హెడ్ కానిస్టేబుల్ లకు ఏ.యస్.ఐ లుగా పదోన్నతి

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

SP Sarath Chandra Pawar : ప్రజాదీవెన,నల్గొండ టౌన్ : పదోన్నతి పొందిన యస్.ఐ లకు పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమ శిక్షణతో, బాధ్యతగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ పోలీస్ శాఖ పై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పని చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 10 మంది హెడ్ కానిస్టేబుల్ లకు , ఏ.యస్.ఐ లుగా పదోన్నతి పొందిన సందర్బంగా జిల్లా ఎస్పీ స్టార్ లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ సందర్బంగా యస్.పి మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలతో మమేకం అవుతూ బాధ్యతతో పని చేసి ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా పని చేయాలి అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాద పూర్వకంగా ఉంటూ వారి యొక్క సమస్యల అడిగి తెలుసుకొని బాధితులకు సరిఅయిన న్యాయం జరిగే విదంగా పనిచేయాలని అన్నారు.

 

అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందని, దానిని పెంపొందే దిశగా పనిచేసి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.