SP Sunpreet Singh: ప్రజా దీవెన,కోదాడ: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ (SP Sunpreet Singh) ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ DSP మామిళ్ళ శ్రీధర్ రెడ్డి ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో మంగళవారం, పట్టణం లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో (Kitts College of Engineering for Women)షీ టీమ్స్ , సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, పోలీసు కళాభృందంతో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ రాము మాట్లాడుతూజిల్లా ఎస్పి అధ్వర్యంలో షీ టీమ్స్, సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు.
ప్రతి గ్రామంలో, స్కూల్లో కళాశాలలో, వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా,ATM కార్డ్ వివరాలు,OTPవివరాలు (Bank Account, ATM Card Details, OTP Details)ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.సైబర్ మోసాలపై1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై100 కుసమాచారం ఇవ్వాలని తెలిపినారు అలాగే షీ టీమ్స్ మహిళ SI నీలిమ మాట్లాడుతూ మహిళల రక్షణపైపటిష్టంగాపనిచేస్తున్నామని, ఆకతాయిలా ఆటలు సాగవని, మహిళలను ఆడపిల్లలను గౌరవించాలని తెలియజేశారు అదేవిధంగా ఆత్మ రక్షణ కొరకు మెలుకువలు నేర్చు కోవాలన్నారుఎవరైనా మీ ఆత్మగౌరవాన్ని భంగపరిచినట్లయితే షీ టీం నెంబర్ 8712686056 కు సమాచార తెలియజేయవచ్చు అన్నారు టీ సేఫ్ యాప్ గురించి విద్యార్థినిలకు (For female students) వివరించారు.
కళాశాల చైర్మన్నీలాసత్యనారాయణ మాట్లాడుతూ, విద్యార్థినులు, మొబైల్ ఫోన్స్ (Students, mobile phones)ను విజ్ఞానానికి ఉపయోగించు కోవాలని, చెడు వ్యసనాలకు, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ లతో జాగ్రత్త గా ఉండాలని సూచించారు. అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థినిలకు అవగాహన కల్పించారుఈ కార్యక్రమం నందు కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, ప్రిన్సిపల్ గాంధీ, కోదాడ షీ టీం ASI కృష్ణమూర్తి,సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ గోవిందు, హెడ్ కానిస్టేబుల్ యల్లారెడ్డి, కానిస్టేబుల్ యాకూబ్, మహిళ కానిస్టేబుల్ సాయి జ్యోతి, మహిళ సాధికారిత కేంద్రం డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ చైతన్య, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ హేమలత,భరోసా సెంటర్ మౌనిక, శృతి, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, గురులింగం, క్రిష్ణ,చారి, నాగర్జున మరియు కిట్స్ కళాశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.