Special prayers: ప్రజా దీవెన, కోదాడ: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు (rains) కోదాడ సూర్యాపేట ఖమ్మం విజయవాడ లో ప్రాణాలు కోల్పోయిన వారి కొరకు యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కోదాడ వారు మంగళవారం పట్టణములోని స్థానిక బాప్టిస్ట్ చర్చిలో కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు పాస్టర్ యెసయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు (Special prayers) నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు .
ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలు వరద ఉధృతికి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలకు ప్రభువైన యేసుక్రీస్తు మనోధైర్యాన్ని శాంతిని చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు మరికొందరికి సరైన ఆహార దొరకక అనేకఇబ్బందులు పడ్డారని వారందరి కోసం ప్రత్యేక ప్రార్థనలు (Special prayers)నిర్వహిస్తున్నామని తెలిపారు వరదలలో ప్రజలకు సేవా కార్యక్రమాలు సహాయ సహకారాలు అందించిన పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యురాలు వంటే పాక జానకి యేసయ్య, యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు పాస్టర్ యెసయ్య ఉపాధ్యక్షులు డేవిడ్ రాజారావు కోఆర్డినేటర్ ఎం సుందర్ రావు పట్టణ అధ్యక్షులు ప్రభుదాస్ కోదాడ నియోజకవర్గం సెక్రటరీ రాజేష్ అనంతగిరి మండల అధ్యక్షులు డేనియల్
హారిగోన్స్ సామ్యూల్ శిబా శాలిని మోజస్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.