Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SPNarasimhaIPS: మద్యంమత్తులో డ్రైవింగ్ ప్రాణాలకేముప్పు

–మధ్యంమత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై నెలరోజులగా స్పెషల్ డ్రైవ్.
–గడిచిన నెలరోజుల్లో 1509 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు, రూ.5 లక్షల 41 వేల జరిమానా.
— 15 మంది మద్యంబాబులకు జైలు శిక్ష అమలు.
— మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం, నేరం.

–సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

SPNarasimhaIPS : ప్రజాదీవెన, సూర్యాపేట: గత నెల రోజు లుగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ జిల్లా కేంద్రం సహా అ న్ని పోలీసు స్టేషన్ ల పరిధిలో మద్యంతాగి వాహనాలు నడుపు తున్న వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ ద్వారా 1509 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగినది జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఇందులో 15 మందికి జైలు శిక్షల పడ గా మొత్తం కేసుల్లో రూ.5 లక్షల 41 వేలు కోర్టుల నందు జరిమానా కట్టించడం జరిగినది. మద్యంతాగి వాహనాలు నడుపుతున్న వారి పై సూర్యాపేట డివిజన్ పరిధిలో 957 కేసులు, కోదాడ డివిజన్ పరిధిలో 552 కేసులు నమోదు చేయబడ్డాయి.

మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదం, నేరం అందుకు జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు అని ఎస్పి గారు హెచ్చరించారు. వానదారులు మద్యం తాగి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగా కాని, పరోక్షంగా కాని రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నరు, మ ధ్యంతాగి వాహనం నడిపినవారు సైతం మృత్యువాత పడుతున్నా రు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అన్నారు. ఇది దృష్టి లో ఉంచి జిల్లా వ్యాప్తంగా మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగినది. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీలు పటిష్టంగా నిర్వహిస్తు న్నాం.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ముందు గా కౌన్సిలింగ్‌ నిర్వహించిన అనంతరం కోర్టులో న్యాయమూర్తి ఎ దుట పర్చడం ద్వారా వాహనదారులకు కోర్టులో జైలు శిక్షలు, జరి మానా విధించడం జరుగుతుందని. ఎస్పీ గారు సూచనలు చేస్తూ కుటుంబాలను దృష్టిలో వుంచుకొని వాహనదారులు మద్యం సేవిం చి వాహనం నడపవద్దని, తప్పిదాలతో ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయినవారు, అంగవైకల్యంగా జీవితాలను కొనసాగిస్తూన్నా రని, ఇకనైన వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడప వద్దని, వాహనదారులు తమ గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పి తెలిపారు.