–క్రికెట్ పోటీలలో ప్రతిభ చాటిన జర్నలిస్టులు
Sports : ప్రజా దీవెన, నల్లగొండ : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు క్రీడా పోటీలు దిగ్విజ యంగా కొనసాగుతున్నాయి.శని వారం ఎన్జీ కళాశాల మైదానంలో ప్రారంభమైన రెండో రోజు పోటీల్లో భాగంగా క్రికెట్ క్రీడా పోటీలు, టెన్ని కాయట్, బాస్కెట్ బాల్ తదితర క్రీడాంశాల్లో విశేష ప్రతిభను కనబరి చారు. క్రికెట్ లో మూడు టీo సభ్యులు కూడా అద్భుత ప్రతిభను కనబరిచాయి.ఇందులో ఫైనల్లో ఓడపల్లి మధు (దిశా) టీం హారా హోరు పోరులో గెలుపొందారు. రాజు (ఆంధ్రజ్యోతి) టీం రన్నరప్ గా నిలిచింది. మొదటగా కె ఎన్ అర్ టీం కూడా మంచి ప్రదర్శన చేశారు. రింగ్ బాల్ లో సింగిల్స్ లో రవి శంకర్ విజయం సాధించగా రన్నర్ గా సతీష్ జనసేన అలాగే డబుల్స్ లో ఓడపల్లి మధు దిశ టీం విజయం సాధించగా రన్నర్ గా సతీష్ జనసేన టీం గెలుపొందా రు.ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి, పులి మామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్ మాట్లాడుతూ మాన సిక ఉల్లాసానికి ఆటలు ఎంతో కీ లకమన్నారు. మన రోజు వారి జీవి తంలో ఆటలు కీలకం కావాలి అ న్నారు.
అలాగే గౌరవ సలహాదా రు లు గుండగోని జయ శంకర్ మా ట్లా డుతూ ప్రతీ జర్నలిస్ట్ వృత్తి పరమై న జీవితమే కాకుండా వ్యక్తిగత జీ వితానికి సమయం కేటాయించాల ని సూచించారు. ప్రతీ ఒక్కరూ క్రీడ లు, వ్యాయామానికి సంబంధించి ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని జీవి తాన్ని ఆనందమయం చేసు కోవా లని పేర్కొన్నారు. మనం వార్తలే కా దు ఆటల్లో కూడా ఎంతో నైపు ణ్యం కలిగిన వారీగా ప్రెస్ క్లబ్ క్రీడో త్సవాల్లో ప్రతి ఒక్కరి అట తీరు రుజువైందన్నారు.
ఈ క్రీడల పోటీ ల్లో ధికొండ రవిశంకర్, జనార్ధన్ రెడ్డి, షరీఫ్, రాజు, వినో ద్, మల్లి, యాద గిరి, అజిద్, శ్రీకాంత్, అశోక్ రెడ్డి, సురేష్, సాయి, కాశీరం, సందీ ప్,ప్రవీణ్, కేన్అర్, శ్రీనివాస్, శ్రీ ను,వెంకట్, ఈశ్వర్, నరేష్, శివ, అసిఫ్, రహి మాన్, నగేష్, తిరుమలేష్, జనార్ద న్, మధు, సాయి బాబా, సాయి, సతీష్, ప్రవీణ్, చారి,రవి, వెంకన్న, జనార్దన్, రామకృష్ణ, చిరంజీవి, మ ధు, శంకర్, పరమేష్, ముచర్ల విజ య్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.