–ఏఐఎస్ఎస్ నాయకులు రామావత్ వినోద్ నాయక్
Unrecognized School : ప్రజాదీవెన నల్గొండ : కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎస్పిఆర్ పాఠశాలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని, ఆ పాఠశాలలో విద్యార్థులను చేర్చి తల్లిదండ్రులు మోసపోవద్దని ఆలిండియా స్టూడెంట్ సోషల్ సర్వీస్ నియోజకవర్గ నాయకులు రామావత్ వినోద్ నాయక్ ఆదివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలో విద్యార్థులను చేర్చి విద్యార్థులు బంగారు భవిష్యత్తును ఆగం చేయొద్దని పేర్కొన్నారు.
వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి కొండమల్లేపల్లి పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రికార్డులో పాఠశాలకు ఒక పేరు బయట ఒక పేరు ఉంటుందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మండల విద్యాశాఖ అధికారులు పట్టించుకొని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.