Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Spsharathchandrapawar : నల్లగొండ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణనే ధ్యేయం

 

–నేర నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
–అనుమానిత వ్యక్తుల సమాచారం పోలీస్ స్టేషన్ కు అందించాలి

— నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

— సరైన పత్రాలు లేని 165 బైక్స్, ఆటోలు,గాంజా చాక్లెట్స్, రెండు హుక్కా పార్ట్, ఒక ఎయిర్ గన్ సీజ్

Spsharathchandrapawar : ప్రజాదీవెన నల్లగొండ: నల్ల గొండ  జిల్లాను నేర, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్ది ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడమే ధ్యేయం. జిల్లాలో నేర నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. అనుమానిత వ్యక్తుల సమాచారం సమీప పోలీస్ స్టేషన్కు అందించాలని జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవర్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున నల్లగొండ పట్టణం వన్ టౌన్ పరిధిలో గల మాన్యంచెల్కా లో డీస్పీ, 8 మంది సీఐలు 24 మంది యస్ఐ లు మొత్తం 320 మంది పోలీస్ సిబ్బం ది, ఒక ఎక్సప్లసివ్ డాగ్, నార్కోటిక్ డాగ్ తో దాదాపు 500 ఇళ్లల్లో సోదాలు చేశారు.

ఈ సోదాలో సరియైన పత్రాలు లేని 165 వాహ నాలు, నాలుగు ఆటోలు, గంజా చాక్లెట్స్, రెండు హుక్కా పార్ట్, ఒక ఎయిర్ గన్ సీజ్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఎస్పీ వివరాలను వెల్లడించారు. ఎక్కువగా జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన 150 అనుమానితులను గుర్తిం చడం జరిగిందని తెలిపారు.అలాగే నలుగురు రౌడీ షీటర్స్ అదు పులో తీసుకోగా వీరిలో ఒకరీ వద్ద నుండి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందనీ అన్నారు.

మొత్తం 30 మందిని గాంజా టెస్ట్ నిర్వహించగా 8 మంది సేవించి నట్టు టెస్టులో రిపోర్ట్స్ రావడం జరిగిందని, వీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేసి సేవించారనే దానిపైన విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.ముఖ్యంగా కమ్యూనిటి కాంటాక్టులో భాగంగా పట్టణం లో కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కా లనీల్లో, ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంట నే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు.

కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసు కు న్నాకే ఆద్దెలకు ఇవ్వాలని సూచించారు. నేరరహిత పట్టణంగా తీర్చి దిద్దడంతోపాటు ప్రజలకు శాంతిభద్రతలు కల్పించాలని గం జాయి తదితర మాదకద్రవాలను నిలువరించడం కోసం కృషీ చేస్తున్నా మని తెలిపారు. జిల్లాలో గంజాయిని ఆరికట్టడం కోసం మూ డు దశల్లో కార్యాక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఎక్కడైన గంజాయి సేవిస్తున్నట్లు, విక్రయించినట్లు, రవాణా చేస్తున్న ట్లు కానీ తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వా లని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. తప్పుడు డాక్యుమెంట్లతో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపా రు.జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, నేర నియంత్ర ణకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు రాజశేఖర్ రెడ్డి, రా ఘవరావు, ఆదిరెడ్డి, కొండల్ రెడ్డి, నాగరాజు, రాజశేకర్, సీఐ మహా లక్ష్మయ్య, కరుణాకర్ ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొ న్నారు.