–ఘనంగా జాతీయ క్రీడ దినోత్సవ వేడుకలు
–ధ్యాన్ చంద్ విగ్రహానికి పూల మాలలు
–హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క
Sridhar Babu: ప్రజా దీవెన, క్రీడాభివృద్ధికి తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రా ధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మం త్రివర్యులు డి.శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు.గురువారం గచ్చిబౌలి స్టేడియం లో జరిగిన జాతీయ దినోత్సవ వేడుకలకు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి డి సీతక్కతో (sitakka) కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్టేడియంలోని ధ్యాన విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ చేసి అనంతరం ఆయన స్మారక హాకీ మ్యాచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని రంగాల్లో మార్పు సాధించా లన్న లక్ష్యంతో క్రీడారంగంలో (sports) సమూ లమైన మార్పులు తీసుకురా వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తుందని అన్నారు. నూతన క్రీడా విధానం ప్రకటింnచడంతోపాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెల కొల్పి క్రీడారంగంలో అంచ లంచలుగా మార్పులు తీసుకొస్తా మని ఆయన అన్నారు. తెలంగాణ క్రీడా శాఖ (Telangana Sports Department) తీరును దిగినీకృతం చేస్తామని ఆయన తెలిపారు.
ఈ వేడుకల్లో భాగంగా ఒలింపియన్లు ఇషా సింగ్, నికత్ జరీన్ (Isha Singh, Nikat Zareen)లకు 5 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఒలంపియన్ ముఖేష్, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు ఇస్మాయిల్ బేగ్ సయ్యద్ నయీముద్దీన్ అర్జున అవార్డు గ్రహీతలు నీతా దాద్వే అనూప్ కుమార్ యామ, లను మంత్రి సన్మానించారు. ఉద్యోగుల క్రీడా పోటీల విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు.
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ (Sports Authority Chairman)కే శివసేన రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించినంత ఘనంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్రీడా దినోత్సవం నిర్వహించామని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మరిన్ని జాతీయ అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మారబోతుందని ప్రకటించారు. శాసనసభ్యులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ ( రామగుండం) జి మధుసూదన్ రెడ్డి (Madhusudan Reddy)దేవరకద్ర యువజన అభివృద్ధి పర్యాటక శాఖ క్రీడల ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాణి ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి విసీ & ఎండి కే సోని బాలాదేవి ఒలంపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి జగదీశ్వర్ యాదవ్ హైదరాబాద్ తెలంగాణ హాకీ అసోసియేషన్ కొండా విజయకుమార్, భీమ్ సింగ్ టీజీవో టీఎన్జీవో సచివాలయ ఉద్యోగ ప్రతినిధులు నాలుగో తరగతి ఉద్యోగ సంఘ ప్రతినిధులు ఒలంపిక్ అసోసియేషన్ (Olympic Association)ప్రతినిధులు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ రూపొందించిన క్రీడ సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడాకారులను విద్యార్థులను అలరించాయి.