Sridhar Reddy :ప్రజా దీవెన, కోదాడ:సమాజంలో జరుగుతున్న చెడును, మంచిని ఎప్పటికప్పుడు వార్తలు సేకరించి పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయడంలో వారి కృషి ప్రశంసనీయమని కోదాడ మాజీ శాసనసభ్యులు వేనేపల్లిచందర్రావు టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు.
మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్ అన్నారు గురువారం పట్టణములోని నిజం చెప్తాం కోదాడ ఇన్చార్జి శివనాగు ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన క్యాలెండర్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్నేని బాబు, పాలసీతయ్య,ఉమా శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కందులు కోటేశ్వరరావు యూత్ నాయకులు డేగ శ్రీధర్ ముత్తారపు రామారావు, డాక్టర్ బ్రహ్మం ,ఈదుల కృష్ణయ్య, సీతారాం రెడ్డి, దావుల తదితరులు పాల్గొన్నారు