Srinivas Goud : ప్రజా దీవెన, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామానికి చెందిన ప్రముఖ డాక్టర్ పవన్ సాయి మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ను పలువురు బీసీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఎంతో మంది నిరుపేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, నిరుపేద విద్యార్థులకు, పేదలకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఎంతో మంది సేవచేస్తున్నాడని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో శాలిగౌరారం సింగల్ విండో సీఈఓ నిమ్మల ఆంజనేయులు,మాదారం మాజీ సర్పంచ్ జెరిపోతుల చంద్రమౌళి గౌడ్, గుండగొని వెంకన్న గౌడ్, శీలం రాజు,బట్ట శ్రీనివాస్ మాదిగ, బాకీ వెంకటయ్య,చిల్లంశెట్టి లక్ష్మి శ్రీనివాస్,తండు నగేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.