టిఆర్ఎస్ నాయకుల్లారా నోరు* అదుపులో పెట్టుకొని మాట్లాడండి*
**మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud : ప్రజా దీవెన/కనగల్: పదవులు శాశ్వతం కాదు మాట శాశ్వతం అని మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ముఖ్య కార్యకర్తలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదేళ్ల కాలంలో టిఆర్ఎస్ చేసింది ఏమీ లేదు.. ఇప్పటికైనా టిఆర్ఎస్ నాయకుల్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి నోటికి ఎంత వస్తే ,అంత మాటలతో మాట్లాడకండి.. గత రెండు రోజుల క్రితం నల్లగొండలో జరిగిన రైతు మహాధర్నలో మాట్లాడిన కేటీఆర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదు గతంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే చూడలేక మంత్రి పదవి వద్దని రాజీనామా చేసి సోనియాగాంధీతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ముందు వరుసలో ఉన్న ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాంటి వ్యక్తిని నల్లగొండ క్లాక్ టవర్ దగ్గర మహా ధర్నాలో కేటీఆర్ విమర్శించడం మంచిది కాదు ఇప్పటికైనా టిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 70% రైతులకు అందుతున్నాయి ఇంకా 30 శాతం కూడా త్వరలో అందుతున్నాయని అన్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు మానుకోవాలి..ప్రతిపక్షంలో ఉండి ధర్నాలు చేసుకోవాలి ,ప్రభుత్వంపై విమర్శలు చేయాలి కానీ గత పది రోజుల క్రితం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ చాంబర్లో లేకున్నా ఉన్నారని లోపటికి వెళ్లి ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు నల్లగొండ నియోజకవర్గం లో మంత్రి చొరవతోనే అభివృద్ధికి ముందుకు వెళ్తుందని అన్నారు ఇక ముందు ముందు నల్లగొండ నియోజక వర్గం అభివృద్ధి చేసి చూపిస్తామని నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో గోలి జగాల్ రెడ్డి, రాజిరెడ్డి ,రాంబాబు, గోగు యాదయ్య ,సింగం పెద్దలు, ఆవుల శంకర్, సత్తయ్య ఏటేలి కృష్ణయ్య శ్రవణ్ కుమార్ ముత్తయ్య వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు