–ధర్నాలు,నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి
–భవిష్యత్తులో కంచర్ల కౌన్సిలర్ గా కూడా గెలవబోడు
–అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే తగిన గుణపాఠం చెప్తాం
–అభివృద్ధికి కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్
–నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షు డు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సి పల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి
Srinivas Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి కోమటిరె డ్డి వెంకట్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య లు చేస్తే ఎవరికైనా బడిత పూజ తప్పదని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు హెచ్చరించారు.
బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్లగొండ,తిప్పర్తి మాజీ జెడ్పిటిసిలు వంగూరి లక్ష్మయ్య, పాశం రాం రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి లేదని హెచ్చరించారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకోవాలని, లేనిపక్షంలో ఇంటికొచ్చి కొడతామని హెచ్చరించారు.నల్లగొండ మున్సిపాలిటీలో కంచర్ల భూపాల్ రెడ్డి చేసిన నిరసన, దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు.ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేయాల్సి ఉండగా, గుండాలు,రౌడీలు, గంజాయి బ్యాచ్ తో మున్సిపాలిటీలో కమీషనర్ ఛాంబర్ కు వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు.మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇంకా పదవిలో ఉన్నాననే భ్రమలో ఉన్నారని, భవిష్యత్తులో ఆయన కౌన్సిలర్ గా కూడా గెలవడం ఎద్దేవా చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జిల్లాలో ఫ్లోరైడ్ విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశాడని అన్నారు. జాతీయ రహదారి ఆరు లైన్లుగా మంజూరు చేయించిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిదేనని స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు గురించి ఎన్నడు పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయించాడని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని విస్మరించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిలు అధికారం కోల్పోయిన తర్వాత కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాతో పాటు నల్గొండ నియోజకవర్గ ధ్యేయంగా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. అభివృద్ధికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్ అని స్పష్టం చేశారు. నల్గొండ మున్సిపాలిటీలోని 16 వార్డులలో అండర్ గ్రౌండ్ పనులు జరుగుతున్నాయని, నియోజకవర్గంలో 8 సబ్ స్టేషన్లు మంజూరు చేయించి పనులు చేపట్టాడని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కంచర్ల భూపాల్ రెడ్డి తన పార్టీకి చెందిన వారితో పాటు అధికారులను నోటికొచ్చినట్టుగా దూషించాడని ధ్వజమెత్తారు.
నల్గొండ అభివృద్ధిని బ్రష్టు పట్టించారని విమర్శించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. స్థాయిని మరిచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శిస్తూ, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని వారు తీవ్రంగా హెచ్చరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు చిత్తుగా ఓడించిన వారికింకా బుద్ధి రాలేదని ఎద్దేవ చేశారు. మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో బడితపూజ తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం కంచర్ల భూపాల్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆ పార్టీ నాయకుల మెప్పు పొందాలని చూస్తున్నాడని ఆరోపించారు. అభివృద్ధి దేంగా పనిచేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనిచిత వ్యాఖ్యలు చేస్తే ఇక చూస్తూ ఊరుకోమని, తమదైన శైలిలో గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో మైనార్టీ నాయకులు, కౌన్సిలర్ బషీరుద్దీన్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు మారవుని నవీన్ గౌడ్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, జూలకంటి శ్రీనివాస్, గణేష్ నాయకులు మందడి శ్రీనివాస్ రెడ్డి, జూలకంటి సైదిరెడ్డి,గోవర్ధన చారి, వజ్జ రమేష్ యాదవ్, గాలి నాగరాజు, పిల్లి రమేష్ యాదవ్, దాసరి ప్రీతి ప్రశాంత్, నాంపల్లి భాగ్య, కిన్నెర అంజి, జానీ యాదవ్, కంచర్ల ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.