* గణిత శాస్త్ర అభివృద్ధి చేసిన కృషి ప్రశంసనీయం.
*డిజిటల్ షో ద్వారా శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలు వివరణ…. ఎం ఈ ఓ,
ప్రజా దీవెన, కోదాడ: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శ్రీనివాస రామానుజన్ అయ్యగారు జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మండల విద్యాధికారి సలీం షరీఫ్
పాల్గొని మాట్లాడారు. శుద్ధ గణితం, గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు కనుగొనడం ద్వారా గణిత శాస్త్ర అభివృద్ధికి శ్రీనివాస రామానుజన్ అయ్యం గారు ఎనలేని కృషి చేశారని తెలియజేశారు.
. శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలు గణిత శాస్త్ర అభివృద్ధికి చేసిన కృషిని డిజిటల్ షో ద్వారా విద్యార్థులకు వివరించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ , గణిత శాస్త్ర ఉపాధ్యాయులు పాండురంగ చారి, ఎస్ కె. ఖా జా మియా, వేణు కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, లింగయ్య,హేమలత, వీర బ్రహ్మా చారి, చిన్నప్ప, జానకిరామ్, రవి, శ్రీనివాస్, బడుగుల సైదులు విద్యార్థులు పాల్గొన్నారు.