Srinivas Rao: ప్రజా దీవెన, సివిల్ సప్లై గోదాములలో పనిచేస్తున్న కార్మికులకు పెంచిన రేట్లను తక్షణమే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పట్టణంలోని స్థానిక బాలాజీ నగర్ నందు గల సివిల్ సప్లై గోదాములలో చేపట్టిన హమాలీ ల సమ్మె 2వ రోజు కు చేరుకున్నది, కోదాడ సివిల్ సప్లై గోదాం వద్ద జరుగుతున్న సమ్మెలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఒప్పుకున్నా హమాలీ రెట్ల ₹. 26/- నుండి ₹. 29/- జి ఓ ను 31 డిసెంబర్ వరకు విడుదల చేస్తామ్మన్నా కమీషనర్ ఇంతవరకు విడుదల చేయకపోవడం బాధాకరంమని డిసెంబర్ 18 న సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా బోనస్ 7500 నుండి 10,000 రూపాయలు పెంచాలని, కుట్టుకూలి 1200/- నుండి1500 రుపాయాలు పెంచాలని మహిళా కార్మికులకు 6000/- నుండి 10000/- ESI కార్డు లు ఇవ్వాలి, ఆరోగ్య కార్డు లు ఇవ్వాలి
, అన్ని మండల కేంద్రాలలో 10 వేల టోన్నుల నిల్వ ఉంచే విధంగా గోదాం లు నిర్మించాలి
అని డిమాడ్ చేసారు.
కమీషనర్ నిర్లక్ష్యం వలన ఈ సమ్మె కొనసాగుతుందని అన్నారు.
కమీషనర్ వెంటనే సస్పెండ్ చేయాలనీ అన్నారు. అధికారులు సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమీంపచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై గోదాం అధ్యక్షులు పోలంపల్లి కొండలు నాయకులు లక్ష్మణ్ ఎన్ శ్రీనివాస్ గౌరీ నాయుడు షేక్ నాగుల్ మీరా ఈ సమ్మెకు ఆటో యూనియన్ నాయకులు వేముల రాము మద్దతు పలకగా తదితర హమాలీలు పాల్గొన్నారు.