సీతారాముల కల్యాణానికి అయోధ్య నుండి పట్టు వస్త్రాలు
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం నల్లగొండ పట్టణం పాతబస్తీ 12వ వార్డు హిందూపూర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
స్వామివారికి పట్టు వస్త్రాలు రావడం చాలా సంతోషంగా ఉంది
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పెరిక ముని కుమార్
ప్రజా దీవెన నల్లగొండ; శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం నల్లగొండ పట్టణం పాతబస్తీ 12వ వార్డు హిందూపూర్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అయోధ్య శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ నుండి పట్టు వస్త్రాలను పంపించడం జరిగింది.
అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ హిందూపూర్ దేవాలయంలో జరిగే కళ్యాణ మహోత్సవానికి బిజెపి జిల్లా ముఖ్య అధికార ప్రతినిధి పెరిక ముని కుమార్ ద్వారా పట్టు వస్త్రాలను స్వామివారికి ఆలయ అర్చకులకు అందించడం అందించారు.ఈ సందర్భంగా పెరిక ముని కుమార్ మాట్లాడుతూ 500 సంవత్సరాల హిందువుల కల ఈ సంవత్సరం అయోధ్య రామ జన్మభూమిలో దేవాలయాన్ని నిర్మించుకోవడం ప్రారంభించి పూజా కార్యక్రమాలు జరపడం శ్రీరాముడి భక్తులందరికీ ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు.
శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ అయోధ్య నుండి దేశవ్యాప్తంగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్న దేవాలయాలకు స్వామివారికీ, అమ్మవారికీ, ఆలయ అర్చకులకు అయోధ్య నుండి పట్టు వస్త్రాలను పంపించడం జరిగిందని, పట్టు వస్త్రాలను భక్తుల సమక్షంలో స్వామివారి సన్నిధికి చేర్చడం ఆనందం కలిగించే విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సట్టు శంకర్, నరేందర్, చిత్రం వెంకటేశ్వర్లు, పెరిక వెంకన్న, హరినాథ్, హరి ప్రసాద్, పెరిక శ్రీనివాసులు, హనుమాన్ ప్రసాద్, దేవేందర్, జనార్ధన్, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Srirama navami celebrations in Nalgonda