Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Srisailam launch journey start : అటవీ అందాల మధ్య సాగే అద్భుత ప్రయాణం

--నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం లాంచ్ ప్రయాణo ప్రారంభo --120 కిలోమీటర్లు, 6 గంటల్లో నాగార్జునకొండ, నందికొండ, సలే శ్వరం నల్లమల్ల గూండా

అటవీ అందాల మధ్య సాగే అద్భుత ప్రయాణం

–నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం లాంచ్ ప్రయాణo ప్రారంభo
–120 కిలోమీటర్లు, 6 గంటల్లో నాగార్జునకొండ, నందికొండ, సలే శ్వరం నల్లమల్ల గూండా

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ ( nagarjuna Sa gar) నుండి శ్రీశైలం(srisailam) వరకు అద్భుత బోటు ప్రయా ణాన్ని కార్తీక మాసం తొలిరోజు శనివారం పర్యా టకశాఖ ప్రారంభిం చింది. గత ఐదే ళ్లుగా ప్లాన్ చేస్తున్నప్పటికీ నాగార్జు నసాగర్ డ్యాం లో సరైన మట్టం లో నీటి లభ్యత లేకపోవడం, కరో నా ( corona) మహమ్మారి తదితర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ప్రస్తుత వర్షాకాల సీజన్ లో విస్తృతస్థాయిలో వర్షాలు పడ డం వల్ల కృష్ణానది ( krishna rev or) తీరం వెంట, అటు శ్రీశైలం నుండి ఇటు నాగార్జున సాగర్ డ్యాం వరకు గరిష్ట మట్టంలో నీటి లభ్యత ఉండటం వల్ల రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ( Telangana tourism corp oration) శనివారం నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు ఈ బోట్ ( launch journey ) ప్రయాణాన్ని ప్రారం భించింది. దాదాపు 120 కిలోమీ టర్ల దూరం ఉండే ఈ లాంచ్ ప్రయాణానికి మొట్టమొద టి రోజున తెలంగాణ రాష్ట్రంతో పాటు పరిసర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు.

పర్యాటకులు నాగార్జున సాగర్ నుండి నందికొండ మీదుగా, ఏలేశ్వ రం, సలేశ్వరం, తూర్పు కను మలు, నల్లమల ( nallamala) అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయా ణానికి పర్యాటక శాఖ శనివారం శ్రీకారం చుట్టింది. మరొక టూరిజం ప్యాకేజి, నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల ( sima shila) నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా నేటి నుంచి అం దుబాటులోకి తెచ్చింది. కొల్హాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణిం చేలా ఏసీ లాం చీని అధికారులు ప్రారంభించారు.

శ్రీశైలం వరకు (120 కిలోమీటర్లు) 7 గంటల పాటు లాంచీ ప్రయా ణం ఉంటుంది. ఈ లాంచీ ప్రయాణానికి పెద్దలకు (adults)  2 వేల రూపాయలు, పిల్లలకు 1,600 రూపాయల టికెట్‌ ధర నిర్ణయిం చా రు. ఒకవైపు మాత్రమే.ఇది కేవలం జ‌ర్నీకి సంబంధించిన రుసు ము మాత్రమే. శ్రీశైలంలో రూమ్‌, ట్రాన్స్‌ పోర్ట్‌ (tronsport) ఎవరికివారే భరించాల్సి ఉంటుంది. నాగా ర్జునసాగర్‌ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశై లానికి లాంచీలు నడిపిస్తారు.

Srisailam launch journey start