SRK Murthy: ప్రజా దీవెన,కోదాడ: దేశంలో, రాష్ట్రంలో న్యాయవాదులపై (lawyers)రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, దాడులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఆర్ కే మూర్తి SRK Murthy)డిమాండ్ చేశారు. హైదారాబాద్ లో సిటీ సివిల్ కోర్టులో (City Civil Court)న్యాయవాది షేక్ కలీం పై ఒక కేసులో ప్రత్యర్థులుగా వున్న వారు గత నెల 29వ తేదీన దాడికి పాల్పడ్డారు. దీనికి నిరసన గా గురువారం కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి, కోర్టు ఆవరణలో నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై పోలీసులు, కక్షిదారులు, ఇతర వ్యక్తులు వరుసగా దాడులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి పరంగా నిక్కచ్చిగా వ్యవహరించే న్యాయవాదులపై దాడులు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడులకు (attacks)పాల్పడే వ్యక్తులపై ప్రభుత్వాలే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, సీనియర్ న్యాయవాదులు తమ్మినేని హనుమంత రావు, కాకర్ల వెంకటేశ్వర రావు, పాలేటి నాగేశ్వరరావు,రంజాన్ బాషా, సిలివేరు వెంకటేశ్వర్లు, ఏదుల కృష్ణయ్య, శ్రీదేవి, ఉయ్యాల నరసయ్య, పలువురు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.