Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Star Vasavi Club: స్టార్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Star Vasavi Club:ప్రజా దీవెన, కోదాడ: కోదాడ వాసవి క్లబ్ (Star Vasavi Club) అధ్యక్షులు వంగవీటి నాగరాజు (Vangaveeti Nagaraju) ఆధ్వర్యంలో గురువారం పట్టణములో స్థానిక స్వాతి హాస్పటల్లో మహిళలకు ఉచిత వైద్య పరీక్షల (Free medical examinations) శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్ రవిచంద్ర చిత్ర వివాహ వార్షికోత్సవ సందర్భంగా స్వాతి హాస్పిటల్ లో 30 మంది మహిళలకు వైద్యురాలు నర్సింగ్ స్వాతి జ్యోతిర్మయి ఉచిత పరీక్షలు నిర్వహించి సలహాలను జాగ్రత్తలను తెలియజేశారు.

కోదాడ వాసవి క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో ఉచిత (free) కార్యక్రమాలను చేపట్టి పట్టణ ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ జనరల్ ఆర్ రత్న , క్లబ్ సెక్రటరీచిత్తూరు భాస్కర్ కోశాధికారి వెంపటి ప్రసాద్ ఐ ఇ సి వంగవీటి వెంకట గురుమూర్తి పబ్బ గీత గరేనిశ్రీనివాసరావు జగిని ప్రసాద్ , వంగవీటి లోకేష్ రావు పైడిమర్రి సతీష్ బండారు శ్రీనివాస్ ఆర్ సి చల్లా లక్ష్మి నరసయ్య జెడ్ సి ఇమ్మడి సతీష్ యాదరాణి దేవరశెట్టి శంకర్ వివిధ హోదా కలిగిన క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు